టాలీవుడ్లో ఆసక్తికరమైన బజ్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన నెక్ట్స్ సినిమాను దర్శకుడు బాబీతో చేయనున్న సంగతి తెలిసిందే. ఇది వీరిద్దరి కాంబోలో సెకండ్ ప్రాజెక్టు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన “వాల్తేరు వీరయ్య” బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం త్వరలో జరగనుండగా, ఆ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇటీవల బాబీ కొల్లి, పవన్ కళ్యాణ్‌ను కలిసి తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది వైరల్ అయింది. దీంతో పవన్ ఈ కార్యక్రమానికి వస్తారనే అంచనాలు మరింత బలపడ్డాయి.పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్‌కు హాజరైతే, మెగా అభిమానులకు ఇది పెద్ద ట్రీట్‌గా మారనుంది. ఇద్దరు అన్నదమ్ములు ఒకే వేదికపై కనిపించే అవకాశం ఉండటంతో అభిమానుల్లో భారీ ఉత్సాహం నెలకొంది.
ఈ చిత్రాన్ని KVN ప్రొడక్షన్స్ నిర్మించనుంది. భారీ స్థాయిలో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
