- Advertisement -

అసాధారణం..వైభవ్‌పై ప్రశంసలు

- Advertisement -

ఐపీఎల్ 2026లో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అరోన్ ఫించ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్సీబీపై అతడు ఆడిన ఇన్నింగ్స్‌ను “అసాధారణం”గా అభివర్ణించారు.

బర్సపారా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది రాజస్థాన్. ఈ విజయానికి ప్రధాన కారణం వైభవ్, అలాగే ధృవ్ జురేల్ అద్భుత బ్యాటింగ్.

జురెల్ 81 నాటౌట్‌తో మ్యాచ్‌ను ముగించగా, వైభవ్ కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసి మ్యాచ్ దిశనే మార్చేశాడు. అతని దూకుడుతో ఆర్సీబీ బౌలింగ్ పూర్తిగా కుదేలైంది.

ఈ ప్రదర్శనపై స్పందించిన ఫించ్ మాట్లాడుతూ….హజెల్‌వుడ్‌పై అతను ప్రారంభంలోనే ఆధిపత్యం సాధించాడు. గ్రౌండ్ అంతా షాట్లు ఆడే సామర్థ్యం అద్భుతం. ఇంత చిన్న వయసులో ఇలాంటి టాలెంట్ నేను చూడలేదు. అతను వీడియో గేమ్‌లా పరుగులు చేస్తూ, ఎంతో ఈజ్‌తో బంతిని కొడుతున్నాడు – ఇది నిజంగా అద్భుతం అని వ్యాఖ్యానించారు.

ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించి టాప్‌లో నిలిచింది. ఇక వైభవ్ 4 మ్యాచ్‌ల్లో 200 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -