- Advertisement -

సింగర్ మంగ్లీకి షాక్!

- Advertisement -

ప్రఖ్యాత గాయని మంగ్లీ, దర్శకుడు వేణు ఉడుగులకు షాక్ తగిలింది. ఓ న్యాయవాది చేసిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు బీఎన్‌ఎస్‌ సెక్షన్‌ 351(2), 352 కింద కేసు నమోదు చేశారు.

సమాచారం ప్రకారం, మంగ్లీ, ఆమె సోదరుడు శివతో పాటు వేణు ఉడుగుల మరియు మరికొంత మంది కలిసి సుమారు 100 మంది వద్ద పెట్టుబడుల పేరుతో భారీ మొత్తంలో డబ్బు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి డబ్బులు తీసుకున్నప్పటికీ, బాధితులకు లాభాలు ఇవ్వకపోగా అసలు పెట్టుబడిని కూడా తిరిగి ఇవ్వలేదని తెలుస్తోంది.

దీంతో బాధితులు న్యాయవాది సుబ్బారావును ఆశ్రయించారు. వారి తరఫున స్పందించిన ఆయన, ఈ విషయంపై మంగ్లీ మరియు ఆమె బృందాన్ని ప్రశ్నించగా, తనకు ప్రాణహాని కలిగించేలా బెదిరింపులు వచ్చాయని ఆరోపించారు. ఫోన్‌లో మాట్లాడి రోడ్డు ప్రమాదం చేయించి చంపేస్తామని హెచ్చరించారని పోలీసులకు తెలిపారు.

ఈ కేసులో దర్శకుడు వేణు ఉడుగుల పాత్ర కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై మంగ్లీ, వేణు ఉడుగుల నుంచి అధికారిక స్పందన రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -