- Advertisement -

సైకో ప్రేమికురాలు..ప్రియుడిని చంపేసి!

- Advertisement -

బెంగళూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తనను పట్టించుకోవడంలేదని ప్రియుడి చేతులు, కాళ్లు కట్టేసి సజీవ దహనం చేసింది ఓ ప్రియురాలు. బెంగుళూరులోని రాజాజీనగర్ పరిధిలోని భాష్యం సర్కిల్ వద్ద ఉన్న VI స్టోర్లో ఉద్యోగం చేస్తూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కిరణ్, ప్రేమ.

కిరణ్ తనను పట్టించుకోవడం లేదని ప్రేమ కొద్దిరోజులుగా కోపంతో ఉందని తెలిపారు తోటి ఉద్యోగులు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు తన ప్రేమికుడిని ఇంటికి పిలిచి, తనకు ప్రపోజ్ చేస్తానని నమ్మించి చేతులు కాళ్లు కట్టేసి కళ్లకు గంతెలు కట్టింది యువతి.

అనుమానంతో యువకుడు ప్రశ్నించగా, ఇది ప్రపోజల్ ప్లాన్లో భాగమని చెప్పి ఒక్కసారిగా అతనిపై కిరోసిన్ పోసి తగలబెట్టి, ఈ ఘటనను వీడియో తీసింది కిరాతకురాలు.దీంతో తీవ్ర గాయాలతో అక్కడిక్కడే మృతిచెందాడు ఆ యువకుడు.

యువతి హత్యకు ముందుగానే పథకం వేసుకుందని, అందుకే కిరోసిన్ సిద్ధంగా పెట్టుకుందని పోలీసులు తెలిపారు. నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -