- Advertisement -

ఆర్టీసీలో సమ్మె సెగ…ప్రయాణికుల పడిగాపులు!

- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టడంతో సామాన్య ప్రజల రవాణా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆర్టీసీ జేఏసీ (JAC) ఇచ్చిన పిలుపుతో అర్ధరాత్రి నుంచే వేలాది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విధులను బహిష్కరించిన కార్మికులు రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నారు.

సమ్మెను నివారించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆర్టీసీ జేఏసీ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన 41 రోజుల తర్వాత ప్రభుత్వం చర్చలకు పిలవడంపై వారు అసహనం వ్యక్తం చేశారు.తెల్లవారుజాము నుంచే బస్టాండ్‌లకు చేరుకున్న ప్రయాణికులకు నిరాశే ఎదురవుతోంది. గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన వారు గంటల తరబడి వేచి చూస్తూ ఇబ్బందులు పడుతున్నారు.

మంచిర్యాల వంటి డిపోలలో దాదాపు 142 బస్సులు నిలిచిపోయాయి. సమ్మెను అడ్డుకునేందుకు ప్రభుత్వం హైదరాబాద్‌లోని ప్రధాన బస్టాండ్‌లలో అద్దె బస్సులను (Hire Buses) ప్రవేశపెట్టింది. నిరసనకారులు అడ్డుకోకుండా భారీగా పోలీసులను మోహరించింది.బస్సులు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ వాహనదారులు అధిక చార్జీలు వసూలు చేస్తుండటం విశేషం.

ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రభుత్వం ఈరోజు మరోసారి జేఏసీ నాయకులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -