- Advertisement -

పూరీ జగన్నాథ్ ‘స్లమ్‌డాగ్’ టీజర్ అవుట్

- Advertisement -

వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా, డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) మార్క్ రా అండ్ రస్టిక్ కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్’ (SlumDog – 33 Temple Road). ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ టీజర్ సోమవారం (జూన్ 8) సాయంత్రం 6 గంటలకు గ్రాండ్‌గా విడుదలై సోషల్ మీడియాలో సరికొత్త రికార్డుల వేటను మొదలుపెట్టింది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతూ మాస్ ఆడియన్స్‌కు పర్ఫెక్ట్ ఐ-ఫీస్ట్‌గా నిలిచింది.

ఈ హై-ఇంటెన్సిటీ టీజర్‌లో పూరీ జగన్నాథ్ మార్క్ మేకింగ్ స్టైల్ ప్రతి ఫ్రేమ్‌లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మురికివాడల (Slum) బ్యాక్‌డ్రాప్‌లో.. ‘‘ఒక్క వాన పడితే కాకుల్లా చెట్ల కింద దాక్కొనే జీవితాలు మావి. అలాంటి మా బతుకులతో ఆడుకుంటే నేనెందుకు వదులుతా’’ అంటూ విజయ్ సేతుపతి తన ట్రేడ్‌మార్క్ వాయిస్‌తో ఇచ్చే పవర్‌ఫుల్ మాస్ ఎంట్రీ డైలాగ్ థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. స్లమ్ పాలిటిక్స్ నేపథ్యంలో సాగే ఈ రివెంజ్ డ్రామాలో విజయ్ సేతుపతి చూపించిన రస్టిక్ హావభావాలు, వయలెంట్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా స్కై-హైకి తీసుకెళ్లాయి.

పూరీ కనెక్ట్స్ (Puri Connects), జె.బి. మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మల్టీస్టారర్ చిత్రంలో గ్లామరస్ బ్యూటీ సంయుక్తా మీనన్, సీనియర్ స్టార్ నటి టబు (Tabu) కీలక పాత్రలు పోషిస్తుండటం విశేషం. టీజర్‌లో చూపించిన మురికివాడల రియలిస్టిక్ సెటప్స్, ఎమోషనల్ అండ్‌ గ్రిప్పింగ్ షాట్స్, దానికి తోడు బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే రామీ (Ramee) మైండ్ బ్లోయింగ్ నేపథ్య సంగీతం (BGM) టీజర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు ఎలివేట్ చేశాయి. అన్ని హంగులు పూర్తి చేసుకుని త్వరలోనే ఐదు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ ‘స్లమ్‌డాగ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్ల సునామీ సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -