- Advertisement -

అబద్ధానికి ప్యాంటు షర్టు వేస్తే చంద్రబాబు!

- Advertisement -

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒక అబద్ధానికి, మోసానికి, వెన్నుపోటుకి, దగాకి, అలాగే స్కాంకి ప్యాంటు షర్టు వేస్తే కనిపించే రూపమే చంద్రబాబు నాయుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం లక్షలాది మంది అభ్యర్థులు రాసే డీఎస్సీ పరీక్షల నిర్వహణలో తీవ్ర లీకేజీలు, అవకతవకలు, స్కామ్‌లు జరిగాయని వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు చేశారు. పరీక్షలు నిర్వహించిన విధానం షాకింగ్‌గా, ఆందోళనకరంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల నమ్మకాన్ని వమ్ము చేశారని, ఈ స్కామ్‌ల వల్ల ప్రతిభావంతులైన యువత జీవితాలు దారుణంగా దెబ్బతిన్నాయని.. ఈ వాస్తవాలను ప్రజల ముందుకు తెస్తామని జగన్ స్పష్టం చేశారు.

వీళ్లే సర్టిఫికెట్లు ఇస్తారు.. వీళ్లే వాటిని ధ్రువీకరించి ఉద్యోగాలిస్తారు..?..జీవో 4, జీవో47 పేరుతో వాళ్ల వారికి ఉద్యోగం ఇచ్చేలా గేట్లు తెరిచారు.. మళ్లీ ఆ జీవోలను రద్దు చేసి..జీవో 23, జీవో 25, జీవో 56తో గేట్లు మూసేశారు అన్నారు. కొత్త జీవోలు తెచ్చి పాత జీవోలను రద్దు చేశారు…గోల్డ్ మెడల్ వచ్చిన వ్యక్తి.. సిల్వర్ మెడల్ అని ఎలా రాస్తాడయ్యా..? చంద్రబాబు ప్రభుత్వ సమాధానాలు చాలా ఆశ్యర్యంగా ఉన్నాయి అన్నారు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు రాకపోతే.. ఫస్ట్ ర్యాంకర్ కోర్టుకు ఎందుకు వెళ్తాడు..?…తప్పు జరగకపోతే.. ఫస్ట్ ర్యాంకర్ కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు..? చెప్పాలన్నారు. అతని ఐడీ ఎందుకు కనిపించకుండా చేశారు..?,సెకెండ్ మెరిట్ లిస్టులో ఫస్ట్ ర్యాంకర్ పేరు ఎందుకు తొలగించారు..?..అంటే తప్పు జరిగిందనే కదా.. చంద్రబాబూ..? చెప్పాలన్నారు.

దొరికితే నేరం వాళ్ల‌పై నెట్టేయొచ్చ‌నే దుర్భుద్దితో.. కాన్ఫిడెన్షియ‌ల్‌గా జ‌ర‌గాల్సిన డీఎస్సీ క్వ‌శ్చ‌న్ త‌యారీ, అప్లోడ్ ప‌నిని అవుట్ సోర్సింగ్ చేతిలో పెట్టారు అన్నారు.
ఇందులో ప‌నిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి న‌వీన్‌కు కృష్ణా జిల్లా సోష‌ల్ స్ట‌డీస్‌లో ఫ‌స్ట్ ర్యాంక్, టీజీటీ ప‌రీక్ష జోన్‌-2లో 6వ ర్యాంక్‌.. సిస్ట‌మ్‌లో ఉన్న వ్య‌క్తికి టాప్ ర్యాంక్ రావ‌డం.. ఇది అతి పెద్ద స్కామ్‌కు సాక్ష్యం కాదా..?.. రికార్డ్ అంటే ఏంటో చెబుతా.. తెలుసుకో.. చంద్రబాబు..దేశ, రాష్ట్ర చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో.. ఒకే నోటిఫికేషన్, ఒకే టైమ్ లో 1.30 లక్షల ఉద్యోగాలిచ్చిన ఘటన వైసీపీ ప్రభుత్వానిది అన్నారు.

అబ‌ద్ధానికి, మోసానికి, వెన్నుపోటు, స్కామ్‌, ద‌గాకు చొక్కా ప్యాంట్ వేస్తే చంద్ర‌బాబు..చంద్ర‌బాబు రాజ‌కీయ జీవితం చేసినా, ఈ రెండేళ్ల సూప‌ర్ సిక్స్ చూసినా, మేనిఫెస్టో హామీలు చూసినా, టీచ‌ర్ల రిక్రూట్‌మెంట్ చూసినా… ద‌గా, మోసం, అబ‌ద్ధాలు, స్కామ్‌ అన్నారు. చంద్ర‌బాబు, ఆయ‌న సుపుత్రుడు దారుణంగా డీఎస్సీలో స్కామ్ చేశారు..ల‌క్షల మంది ప్ర‌తిభావంతుల జీవితాల‌ను దెబ్బతీశారు.. ఇంత‌టి ఘోర‌మైన డీఎస్సీ ఏపీ చరిత్రలో రిక్రూట్‌మెంట్ జ‌రిగి ఉండ‌దు అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -