- Advertisement -

రామ్ చరణ్ ‘పెద్ది’ ఊచకోత.. బిగ్గెస్ట్ రికార్డ్!

- Advertisement -

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బాక్సాఫీస్ దగ్గర సృష్టిస్తున్న సెన్సేషనల్ కలెక్షన్ల ర్యాంపేజ్ ఆగడం లేదు. ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) కాంబినేషన్‌లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ ఎమోషనల్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (Peddi) థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. గత వారం మైండ్ బ్లాకింగ్ పెయిడ్ ప్రీమియర్స్‌తోనే బ్లాక్‌బస్టర్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు విజయవంతంగా మొదటి వారం రన్‌ను పూర్తి చేసుకుని బాక్సాఫీస్ రేసులో రియల్ ఛాంపియన్‌గా నిలిచింది.

ఈ సినిమా కేవలం మొదటి వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 345 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్లను రాబట్టి ట్రేడ్ వర్గాల్లో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. రామ్ చరణ్ కెరీర్‌లోనే సోలో హీరోగా బిగ్గెస్ట్ గ్రాసర్ చిత్రంగా ‘పెద్ది’ సరికొత్త రికార్డులు లిఖిస్తోంది. ఈ స్పీడ్ చూస్తుంటే ఈ సినిమా చాలా ఈజీగా రూ. 400 కోట్ల క్లబ్‌ వైపు దూసుకెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. లాంగ్ రన్ లో ఈ చిత్రం ఇంకెన్ని వందల కోట్ల రికార్డులను బద్దలు కొడుతుందో అని మెగా అభిమానులు విపరీతమైన జోష్‌లో ఉన్నారు.

వృద్ధి సినిమాస్ (Vriddhi Cinemas) పతాకంపై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబులు తమ సాలిడ్ పర్ఫార్మెన్స్‌తో సినిమాను నెక్స్ట్ లెవెల్‌కు ఎలివేట్ చేశారు. వీటన్నింటికీ తోడు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ (AR Rahman) అందించిన అద్భుతమైన పాటలు, హై-వోల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -