- Advertisement -

బాలీవుడ్‌లో రాజ్ నిడిమోరు భారీ స్కెచ్?

- Advertisement -

‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ వంటి విజయవంతమైన సిరీస్‌లతో దర్శకుడు రాజ్ నిడిమోరు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన బాలీవుడ్‌లో ఒక భారీ బడ్జెట్ సినిమాను రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు.

తాజా ఇంటర్వ్యూలో రాజ్ నిడిమోరు తన భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒక హాలీవుడ్ సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పుడే మొదలయ్యాయని, అది ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉందని ఆయన తెలిపారు. వీటితో పాటు మరో సిరీస్ కూడా అభివృద్ధి దశలో ఉందని చెప్పారు. త్వరలోనే తన హిందీ సినిమా నిర్మాణం ప్రారంభం కానుందని వెల్లడించారు.

ప్రపంచవ్యాప్త ప్రేక్షకులను మెప్పించేలా భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హీరోగా సల్మాన్ ఖాన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై చిత్ర బృందం నుంచి ఇంకా ఎటువంటి అధికారిక స్పష్టత రాలేదు.

గతంలో కూడా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు ప్రచారమయ్యాయి. ఈ చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించబోతున్నారని సోషల్ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే, వాటిని రాజ్ నిడిమోరు సన్నిహిత వర్గాలు ఇప్పటికే ఖండించాయి. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో వస్తున్న ‘SVC63’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -