- Advertisement -

సెన్సేషనల్ ‘చికిరి’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్!

- Advertisement -

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం, రెండో ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ. 393 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. త్వరలోనే రూ. 400 కోట్ల మార్కును దాటబోతుండటంతో, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన సౌత్ ఇండియన్ చిత్రంగా ఇది సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ క్రమంలోనే సినిమాపై హైప్‌ను మరింత పెంచేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి బుధవారం నుంచి సినిమాలో కొన్ని సరికొత్త సన్నివేశాలను జోడించబోతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేరకు చిత్రబృందం తాజాగా సినిమాలోని సెన్సేషనల్ హిట్ నంబర్ ‘చికిరి.. చికిరి’ ఫుల్ వీడియో సాంగ్‌ను కూడా యూట్యూబ్‌లో విడుదల చేసింది. రామ్ చరణ్ మాస్ స్టెప్పులు, జాన్వీ కపూర్ అందాలతో సాగే ఈ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

వృద్ది సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామాలో శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ వంటి అగ్ర నటీనటులు కీలక పాత్రలు పోషించారు. కథ, క్యారెక్టరైజేషన్, మరియు భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న ‘పెద్ది’, బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని కొత్త రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -