- Advertisement -

కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ..!

- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయికగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘కొరియన్ కనకరాజు’. ఈ చిత్రం విడుదల తేదీని చిత్రబృందం తాజాగా ఖరారు చేసింది. ఆగస్టు 7న ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు.

“కనకరాజు వచ్చేస్తున్నాడమ్మీ..” అంటూ చిత్రబృందం ఒక కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో వరుణ్ తేజ్ పూర్తి మాస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఒక చేతిలో కత్తి, మరో చేతిలో గ్రెనేడ్ పట్టుకుని స్టైలిష్‌గా కుర్చీలో కూర్చున్న వరుణ్ తేజ్ లుక్ ప్రేక్షకుల్లో భారీగా క్యూరియాసిటీని పెంచుతోంది. వరుణ్ తేజ్ కెరీర్‌లోనే ఇది ఒక డిఫరెంట్ రోల్ అని పోస్టర్ చూస్తేనే అర్థమవుతోంది.

రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. వినోదం మరియు హారర్ అంశాల కలయికతో సాగే ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. విభిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 7న కనకరాజు థియేటర్లలో ప్రేక్షకులను ఏ విధంగా అలరించనున్నాడో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -