- Advertisement -

హైదరాబాద్ టు ముంబాయి రెండు గంటల్లోనే..

- Advertisement -

రైల్వే తీసుకునే ప్రతి కీలక నిర్ణయంలోనూ, అభివృద్ధి వ్యూహాల్లోనూ తెలంగాణకు పూర్తి భాగస్వామ్యం కల్పిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. గత బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా దేశవ్యాప్తంగా మొత్తం ఏడు సరికొత్త బుల్లెట్ రైలు కారిడార్లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. అత్యంత ఆశ్చర్యకరంగా ఈ ఏడు ప్రాజెక్టులలో మూడు ప్రధాన మార్గాలను భాగ్యనగరం (హైదరాబాద్) కేంద్రంగానే ఖరారు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

దేశంలో 7 బుల్లెట్ ట్రైన్స్ ప్రకటిస్తే.. అందులో తెలంగాణకు 3 దక్కాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కారణంగానే తెలంగాణకు మూడు బుల్లెట్ ట్రైన్స్ దక్కాయని వెల్లడించారు. తెలంగాణ బుల్లెట్ ట్రైన్స్ హబ్‌గా మారబోతోందని అన్నారు. బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్ నుంచి విజయవాడకు కేవలం 1 గంట 10 నిమిషాలు.. హైదరాబాద్ నుంచి ముంబైకి 2 గంటల 20 నిమిషాలు.. హైదరాబాద్ నుంచి చెన్నయ్‌కి రెండు గంటల్లో వెళ్లవచ్చని చెప్పారు.

రైల్వే అభివృద్ధికి సంబంధించి గత ప్రభుత్వాల తీరుపై మంత్రి అశ్వినీ వైష్ణవ్ విమర్శలు గుప్పించారు. భారతీయ రైల్వేలో వచ్చిన ఈ సమూల మార్పులు, ఆధునీకరణ, సంస్కరణల పూర్తి క్రెడిట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుల క్రెడిట్ కోసం కొందరు పాకులాడుతున్నారంటూ విపక్షాలపై మంత్రి మండిపడ్డారు. దీని పూర్తి క్రెడిట్ ప్రధాని మోదీకే దక్కుతుందని, గత యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బడ్జెట్‌లో కేవలం రూ. 800 కోట్లు మాత్రమే ఇస్తే, తమ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే ఏకంగా రూ. 5000 కోట్ల రైల్వే నిధులు కేటాయించిందని గుర్తుచేశారు. ఈ నిధుల వరద వల్లే రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులు పరుగులు పెడుతున్నాయని స్పష్టం చేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -