- Advertisement -

‘టాక్సిక్‌’ నుంచి ‘మనసాగదే..’ సాంగ్ రిలీజ్!

- Advertisement -

రాకింగ్ స్టార్ యశ్‌ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టాక్సిక్‌’ (Toxic). టాలెంటెడ్ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీని ఆగస్టు 26న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాపై హైప్ మరింత పెంచేలా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేసిన చిత్ర బృందం, తాజాగా ‘మనసాగదే..’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను విడుదల చేసింది.

‘మనసాగదే..’ అంటూ సాగే ఈ అందమైన పాటకు తనిష్‌ బాగ్చీ, అర్ల్సాన్‌ నిజామి, ఫహీమ్‌ అబ్దుల్లా కలిసి సంగీతం సమకూర్చారు. ప్రముఖ గీత రచయిత రామజోగయ్యశాస్త్రి ఈ పాటకు చక్కని సాహిత్యందించగా, సింగర్ సిద్ధార్థ్‌ బస్రూర్‌ తన అద్భుతమైన గాత్రంతో పాటకు ప్రాణం పోశారు. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్తూ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

‘కేజీఎఫ్’ సినిమాల తర్వాత యశ్‌ నుంచి వస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ‘టాక్సిక్‌’పై ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈ చిత్రంలో యశ్‌ సరసన నయనతార, కియారా అడ్వాణీ, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి స్టార్ హీరోయిన్లు నటిస్తుండటం విశేషం. భారీ తారాగణం, విభిన్నమైన యాక్షన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -