- Advertisement -

ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ!

- Advertisement -

ఏపీలోని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అనంతపురం జిల్లాలలో జరిగిన రెండు వేర్వేరు భయానక సంఘటనలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఒక చోట వివాహేతర సంబంధం నేపథ్యంలో యువకుడిని కిరాతకంగా హతమార్చగా, మరో చోట కూతురి జోలికి వచ్చిన ప్రియుడి మర్మాంగాన్ని కత్తితో కోసేసింది ప్రియురాలు.

నెల్లూరు జిల్లా గూడూరు మండలం విందూరులో వెలుగు చూసిన మొదటి ఘటన స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన షాహూల్ (21) తండ్రి మృతి చెందగా, తల్లి బతుకుదెరువు కోసం కువైట్‌కు వెళ్లింది. దీంతో షాహూల్ తన అన్నతో కలిసింటూ సెంట్రింగ్ పనులు చేసుకుంటున్నాడు. మద్యం అలవాటు ఉన్న షాహూల్ శుక్రవారం రాత్రి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మిద్దెపైకి వెళ్లి మద్యం తాగాడు. శనివారం ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులు మిద్దెపై రక్తపు మడుగులో పడివున్న షాహూల్‌ను చూసి భయంతో పరుగులు తీశారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి గొంతు కోయడమే కాకుండా, మర్మాంగాన్ని కోసి జేబులోనే పెట్టిన వైనాన్ని పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ అఘాయిత్యం జరిగినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. విద్యార్థులు భయాందోళనకు గురికాకుండా ఆ రోజు పాఠశాలకు సెలవు ప్రకటించారు.

మరోవైపు అనంతపురం సెంట్రల్‌లో జరిగిన మరో షాకింగ్ ఘటన కలకలం రేపింది. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లికి చెందిన ఆటో డ్రైవర్ సురేష్.. స్థానిక డ్రైవర్స్ కాలనీకి చెందిన ఓ మహిళతో గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అయితే కొద్ది రోజులుగా ఆ మహిళ కుమార్తెపై కన్నేసిన సురేష్, ఆమెపై అఘాయిత్యానికి యత్నించాడు. ఈ విషయాన్ని బాధితురాలు పలుమార్లు తల్లికి చెప్పడంతో, ఆమె ప్రియుడిని తీవ్రంగా హెచ్చరించింది. అయినా సురేష్ తీరు మార్చుకోలేదు. శుక్రవారం రాత్రి సురేష్ ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. అర్ధరాత్రి తర్వాత మహిళ బాత్‌రూంకు వెళ్లిన సమయంలో ఆమె కుమార్తెపై బలవంతంగా అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.

బాధితురాలు కేకలు వేయడంతో ఉలిక్కిపడిన తల్లి పరుగున వచ్చి అడ్డుకుంది. అయినా అతను వెనక్కి తగ్గకపోవడంతో విచక్షణ కోల్పోయిన తల్లి, కత్తితో అతని మర్మాంగంపై దాడి చేసింది. తీవ్ర రక్తస్రావంతో సురేష్ కుప్పకూలిపోగా, ఆ మహిళే స్వయంగా పోలీసులకు సమాచారం అందించి స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించింది. ప్రస్తుతం నిందితుడి పరిస్థితి నిలకడగా ఉందని, విచారణ అనంతరం కేసు నమోదు చేస్తామని అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -