- Advertisement -

‘ఇరుముడి’.. కథ చెప్పేసిన దర్శకుడు!

- Advertisement -

శివ నిర్వాణ దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ఫ్యామిలీ, డివోషనల్ ఎంటర్‌టైనర్ ‘ఇరుముడి’ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో రవితేజకు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో రవితేజ అయ్యప్ప మాలలో కనిపించడంతో, ఇది శబరిమల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన సినిమానంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. తాజాగా ఈ వార్తలపై దర్శకుడు శివ నిర్వాణ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ అసలు నిజాలు బయటపెట్టారు.

ఈ కథకు శబరిమల దేవాలయానికి ఎలాంటి సంబంధం లేదని దర్శకుడు స్పష్టం చేశారు. సినిమాలో కథానాయకుడి జీవితంలో వచ్చే 41 రోజుల అయ్యప్ప దీక్ష కేవలం ఒక భాగం మాత్రమేనని తెలిపారు. దీక్షా సమయంలో అయ్యప్ప భక్తులు తమ నియమావళి, అలవాట్ల విషయంలో చాలా నిష్టగా ఉంటారని, చెడు అలవాట్లు లేదా వ్యసనాలు ఉన్న ఒక వ్యక్తి అనుకోకుండా ఈ దీక్ష తీసుకోవాల్సి వస్తే.. అతను మద్యానికి ఎలా దూరంగా ఉండాల్సి వస్తుంది? ఆ సమయంలో ఎదురయ్యే సవాళ్లేంటనే దానిపైనే కథ నడుస్తుందని చెప్పారు. అక్కడే సినిమాలో అసలైన సంఘర్షణ మొదలవుతుందని, కఠినమైన నియమాలు ఉండాలి కాబట్టే తాను అయ్యప్ప స్వామి దీక్ష నేపథ్యాన్ని ఎంచుకున్నానని వివరించారు.

ఈ 41 రోజుల కథే సినిమా స్క్రీన్‌ప్లేకి ప్రధాన బలంగా నిలుస్తుందని, ఇది ప్రేక్షకులను మరింత ఉత్కంఠకు గురిచేస్తుందని శివ నిర్వాణ తెలిపారు. ఆ దీక్షకు ముందు హీరో జీవితం ఎలా ఉంది? దీక్షలో ఉన్న సమయంలో ఏం జరిగిందనే అంశాలు సినిమాను ఆసక్తికరంగా మారుస్తాయని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి శబరిమల ప్రచారానికి తెరదించుతూ, ఇదొక విభిన్న సంఘర్షణతో కూడిన కథ అని దర్శకుడు స్పష్టం చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -