- Advertisement -

ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట‌ర్ అరెస్ట్!

- Advertisement -

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) తరఫున ఆడే బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్ (Abishek Porel) తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ఓ వైద్య విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు తదితర గ్రేవ్ ఆరోపణలపై పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. హుగ్లీ రూరల్ పోలీస్ ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. డుమ్ డుమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు ఈ అరెస్ట్ చేపట్టారు.

గతేడాది జూన్‌లో బాధితురాలైన యువతి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని, ఆ తర్వాత మోసం చేయడంతో పాటు తనపై దాడికి పాల్పడి, క్రిమినల్ బెదిరింపులకు దిగాడని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. గత మూడేళ్లుగా తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నామని, అయితే కొంతకాలం నుంచి అభిషేక్ తనను దూరం పెట్టడం ప్రారంభించాడని తెలిపింది. వివాహం చేసుకుంటానని చెప్పి ఇప్పుడు వెనకడుగు వేస్తున్నాడని ఆరోపించింది.

ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు తదుపరి విచారణ కొనసాగుతోంది. అభిషేక్ పోరెల్ తనపై వచ్చిన ఆరోపణలను గతంలో ఖండించినప్పటికీ, కలకత్తా హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పోలీసులు తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. దేశీయ క్రికెట్‌లో బెంగాల్ జట్టుకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు, ఐపీఎల్‌లోనూ నిలకడగా ఆడుతున్న అభిషేక్ పోరెల్ ఈ వివాదంలో చిక్కుకోవడం క్రికెట్ వర్గాల్లో సంచలనంగా మారింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -