ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ‘ఎన్విడియా’ (Nvidia) సంస్థలో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. వరుస ప్రేమాయణాలు, వ్యక్తిగత వివాదాలు ఆయన పదవికి ఎత్తిపోశాయి. చైనీస్ గూఢచారితో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు, తాజాగా మరో ఉద్యోగితో అఫైర్ వార్తలు రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఆయన స్థానంలో తాత్కాలిక సీఈవోగా కొలెట్ క్రెస్ నియమితులయ్యారు.
కొద్దికాలం క్రితం చైనీస్ గూఢచారిగా భావిస్తున్న అలిస్ హువాంగ్‌తో జెన్సన్ హువాంగ్‌కు సంబంధం ఉందంటూ వార్తలు వచ్చి దుమారం రేపాయి. ఆ వివాదం నుంచి తేరుకోకముందే, తాజాగా మరో సంచలనం వెలుగులోకి వచ్చింది. ఎన్విడియా హెల్త్‌కేర్ విభాగం వైస్‌ప్రెసిడెంట్ కింబర్లీ పావెల్‌తో ఆయనకు ‘సన్నిహిత’ సంబంధం ఉన్నట్లు ప్రముఖ పత్రిక ‘న్యూయార్క్ టైమ్స్’ సంచలన కథనం ప్రచురించింది. ఈ వరుస పరిణామాలు టెక్ ప్రపంచంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించాయి.
కంపెనీలో పనిచేసిన మాజీ ఉద్యోగుల సమాచారం ప్రకారం.. 63 ఏళ్ల జెన్సన్ హువాంగ్, 48 ఏళ్ల కింబర్లీ పావెల్‌తో సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. కింబర్లీకి ఇప్పటికే వేరే వ్యక్తితో వివాహం అయినట్లు తెలిపింది. ఈ ఏడాది మార్చి నెలలో కాలిఫోర్నియాలోని శాన్‌జోస్‌లో జరిగిన ఎన్విడియా ఈవెంట్ సమయంలో.. హువాంగ్, కింబర్లీ ఓ హోటల్లో సన్నిహితంగా గడుపుతుండగా ఒక వ్యక్తి వీడియో తీశారు. వెంటనే అప్రమత్తమైన హువాంగ్ భద్రతా సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు ఒక రహస్య ఒప్పందంపై బలవంతంగా సంతకం చేయించుకున్నారు. ఈ వార్తపై సదరు పత్రిక వివరణ కోరగా హువాంగ్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా ఫోన్ కట్ చేసినట్లు సమాచారం.
కింబర్లీ పావెల్ 2008లో ఎన్విడియాలో చేరారు. అప్పట్నుంచి క్రమంగా ఎదుగుతూ 2017 నాటికి హెల్త్‌కేర్ విభాగానికి వైస్‌ప్రెసిడెంట్ స్థాయికి చేరుకున్నారు. మెడికల్ ఇమేజింగ్ పరికరాలు, ఆరోగ్య సంరక్షణ రంగానికి చిప్ టెక్నాలజీ వినియోగం వంటి కీలక బాధ్యతలను ఆమె పర్యవేక్షించేవారు. అయితే, ఆమెతో హువాంగ్‌కు ఉన్న సంబంధం బయటపడటంతో కంపెనీ బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఇప్పటికే అలిస్ హువాంగ్‌తో సంబంధాన్ని అంగీకరించిన జెన్సన్ను సీఈవో పదవి నుంచి తప్పించేందుకు ఎన్విడియా బోర్డు తీవ్రంగా యోచిస్తున్నట్లు ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ కథనం వెలువరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్విడియా బోర్డు అత్యవసరంగా సమావేశం కానున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తల ప్రభావంతో వాల్‌స్ట్రీట్‌లో పోస్ట్ ట్రేడింగ్ అవర్స్‌లో ఎన్విడియా షేర్లు భారీగా పతనం అయ్యాయి. ఫలితంగా మార్కెట్ విలువలో వందల బిలియన్ డాలర్లు ఆవిరైపోయాయి. కంపెనీ ప్రతిష్టను కాపాడేందుకు, మార్కెట్ నష్టాలను నివారించేందుకు జెన్సన్ హువాంగ్ తన సీఈవో పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

