సుకుమార్ దర్శకత్వంలో ఎన్టిఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ’నాన్నకి ప్రేమతో’. ఈ సినిమా షూటింగ్ లండన్‌లో జరుపుకుంటున్న విషయం అందరికి తెలిసిందే.
అయితే ఈ చిత్రం లండన్‌లో షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏదో ఒక రకంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది.
ఇప్పుడు తాజాగా సుకుమార్ సినిమాలో ఎన్టిఆర్ యూజ్ చేసిన ఖరీదైన బైక్ పోస్టర్ని తన అఫీసియల్ ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోను చూసిన ఎన్టిఆర్ అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.
డైరెక్టర్ సుకుమార్‌తో కలిపి సినిమా యూనిట్ సభ్యులు అంతా కలిసి బైక్ దగ్గరికి చేరి ఇచ్చిన ఫోజ్ చాలా బాగుండటంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ ఈ సినిమాని చాలా ప్రిస్టేజియస్‌గా తీసుకున్నాడని, అందుకే ఎన్‌టిఆర్‌ని కొత్త స్టైల్, న్యూ లుక్‌తో పరిచయం చేస్తున్నాడని సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబందించి వచ్చిన ప్రతి పోస్టర్ అలానే చాలా స్టైల్‌గా ఉన్నాయి. ఏది ఏమైనా బైక్ అదిరింది…