Thursday, May 9, 2024
- Advertisement -

కాంగ్రెస్ ఈ ఆత్మహత్యను క్యాష్ చేసుకొంటోందా..?!

- Advertisement -

ప్రత్యేక హోదా డిమాండ్ తో ఒంటికి నిప్పంటించుకొని ఆత్మాహుతికి పాల్పడ్డ మునికోటిని కాంగ్రెస్ పార్టీ రాజకీయంగావాడుకొంటోందా?

అసలు ఉనికే లేకుండా పోయిన ఏపీలో ఇక నుంచి తాము తిరిగి ఎదగడానికి ఈ అంశం ఉపయోగపడుతుందని భావిస్తోందా? ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ఈ సందేహాలే కలుగుతున్నాయి. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరిగా కాంగ్రెస్ నేతలు రంగం లోకి వస్తున్నారు. మునికోటి ఆత్మహత్య అంశం గురించి ప్రస్తావిస్తూ.. తాము ఏపీ కోసం పోరాడుతున్నాం అని వారు చెప్పుకొంటున్నారు.

కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి అయిన దిగ్విజయ్ సింగ్ మీడియా ముందుకు వచ్చి.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంలో తామెంతో పోరాడుతున్నామని అన్నాడు. ఏపీ ప్రజలు తమను ఆదరించకపోయినా.. తాము వారి కోసం పోరాడుతున్నామని ఆయన అన్నాడు. ఈ విధమైన మాటలతో ఆయన ఏపీ ప్రజల నుంచి సానుభూతిని ఆశించే మాటలు మాట్లాడాడు. ఏపీ కోసం తాముమరింతగా పోరాడతామని ఆయన ప్రకటించాడు.

మొత్తానికి మునికోటి ఆత్మహత్యను కాంగ్రెస్ వాళ్లు క్యాష్ చేసుకొనే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నారు. అయితే ఇప్పుడు పోరాడటం కాదు.. అసలు ఈ సమస్యకు మూలం కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఆ పార్టీ ఏపీని కష్టాల్లోకి నెట్టింది. ఇప్పుడు సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరి ఏపీ ప్రజలు ఎలా క్షమించగలరు?!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -