కత్రినా కైఫ్.. బాలీవుడ్ లో ఇప్పుడు టాప్ పొజిషన్ లో ఉన్న హీరోయిన్. అంతే కాదు.. ఆమె కు ఇప్పుడు మరో హోదా కూడా ఉంది. రణ్ బీర్ కపూర్ కు ప్రియురాలు.
వీళ్ల పెళ్లికి వీళ్ల పెద్దలు కూడా సమ్మతం తెలియ జేశారట.
ఆ మధ్య వీళ్ల పెళ్లి గురించి హడావుడే జరిగింది. అయితే ప్రస్తుతానికి పెళ్లిని వాయిదా వేసుకొన్నామని వీళ్లే ప్రకటించారు. ఈ విధంగా నడుస్తోంది వీళ్ల ప్రేమ కథ. మరి ప్రేమ అన్నాకా కొన్ని అలకలు, గొడవలు కూడా ఉంటాయి. అంతే కాదు.. చిన్న చిన్న అనుమానాలు కూడా మామూలే. ప్రత్యేకించి ప్రియురాలి వైపు నుంచి ఇలాంటిఫిర్యాదులుంటాయి.
తన మనసైన వాడిని వేరే ఆడది తనవైపు తిప్పుకొంటుందేమో అనే భయాలుంటాయి. ఈ భయాలకు కత్రినా కూడా మినహాయింపు కాదని తెలుస్తోంది. తన ప్రియుడు రణ్ బీర్ ను దీపిక ఎక్కడ తన వైపు తిప్పుకొంటుందో అని భయపడుతోందట కత్రినా!
ఇంతకీ విషయం ఏమిటంటే.. దీపిక, రణ్ బీర్ లు కలిసి ఒక సినిమా చేశారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన సందర్బంగా ఇటీవల ఒక పార్టీ జరిగింది. ఈ పార్టీలో అందరూ పాల్గొన్నారు. అక్కడికి ఉన్నట్టుండి కత్రినా వచ్చిందట! ఆహ్వానం లేకపోయినా ఆమె అక్కడికి రావడం వెనుక బలమైన రీజన్ ఉందని.. రణ్ బీర్, దీపికలు ఎక్కడ మళ్లీ ఒకటైపోతారనే భయంతోనే ఆమె అక్కడికి వచ్చిందని తెలుస్తోంది. మాజీ ప్రేమికులు అయిన వాళ్ల మధ్య తను ఉంటేనే… వారు కంట్రోల్ అవుతారని.. లేకపోతే కష్టమని లెక్కలేసుకొని కత్రినా ఇలా చేసిందని వార్తలు వస్తున్నాయి. మరి ఎంత హీరోయిన్ కు అయినా.. ప్రియుడి విషయంలో ఇలాంటి కష్టాలు తప్పవా!