తమిళ దర్శకుడు ఏఆర్ మురగదాస్ తెలుగు, తమిళ భాషల్లో ఒక సినిమాను రూపొందించనున్నాడనే విషయం కన్ఫర్మ్ అయ్యింది. తను తెలుగులో దర్శకత్వం వహించిన ‘స్టాలిన్’ సినిమాకు తనకు అసిస్టెంట్ గా పనిచేసిన గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమాను రూపొందించడానికి మురుగదాస్ సిద్ధం అయ్యాడని తెలుస్తోంది.
మరి ఇప్పుడు ఈ సినిమా లో హీరో ఎవరు? అనేది ఆసక్తికరమైన అంశం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో హీరోగా నటించబోయేది ఎన్టీఆర్ అని తెలుస్తోంది. గోపిచంద్ ఛాయస్ లో ఎన్టీఆర్ ఆ స్క్రిప్ట్ కు తగ్గ హీరో అని టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ హీరోగా పెట్టి ఆ సినిమాను రూపొందించాలని.. దాన్ని తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయాలని గోపిచంద్ మలినేని భావిస్తున్నాడు. ఈ విషయంలో తన గురువు కమ్ నిర్మాత మురగదాస్ ను కూడా ఒప్పించాడట ఈ తెలుగు దర్శకుడు.
అన్ని కుదరితే త్వరలోనే ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ సుకుమార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తర్వాత కూడా ‘కత్తి’ సినిమా రీమేక్ తో అతడు బిజీ అయిపోతాడు. అవి రెండూ పూర్తి అయిన తర్వాతే ఈ సినిమా ఉండవచ్చని తెలుస్తోంది.
