ఇండస్ట్రీలోని ప్రముఖులకు.. ఇప్పుడు డ్రగ్స్ కేసు ఓ వణుకు వణికిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా ఈ కేసులో హీరో రవితేజ ఉన్నాడని.. అతనికి కూడా పోలీసులను నుంచి నోటీసులు అందాయన్న వార్తలు కూడా వస్తున్నాయి. రవితేజ తన డ్రైవర్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకునే వాడని తెలుస్తోంది. అయితే ఈ మధ్యే మరణించిన రవితేజ తమ్ముడు భరత్ కు సైతం ఈ డ్రగ్స్ తో లింకుందని సమాచారం. గతంలో భరత్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ సంగతి అందరికి తెలిసిందే.
ఈ క్రమంలో అన్నదమ్ములకు డ్రగ్స్ అలవాటై ఉంటుందనే కోణంలో అనుమానాలు కలుగుతున్నాయి. భరత్ చావుకి డ్రగ్సే కారణమే వార్త కూడా అప్పట్లో హల్ చల్ చేసింది. అయితే ఇప్పుడు ఈ విషయాలన్నింటిపై రవితేజ తల్లి రాజ్యలక్ష్మి మొదటిసారిగా స్పందించారు. అసలు డ్రగ్స్ తో రవితేజకు ఎలాంటి లింఖ్ లేదని.. రవితేజకు అసలు ఎలాంటి చెడు అలవాట్లు లేవని.. తన కొడుకు ఎలాంటి చెడు అలవాట్లు లేకపోయిన ఇలా డ్రగ్స్ వివాదంలో ఇరికించడం చాలా బాధాకరమని అన్నారు రాజ్యలక్ష్మి. కనీసం సిగరెట్ కూడా తాగడని,తాగేవాళ్లని ప్రోత్సహించడని చెప్పింది. డ్రగ్స్ అలవాటు ఉన్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పింది. కావాలనే కొందరు రవితేజ పేరును ఇరికించారని,కుటుంబం పుట్టెడు దుఖంలో ఉన్నా నిర్మాతలకు నష్టం కలిగించవద్దనే షూటింగ్ లకు వెళ్తున్నాడని అన్నది రాజ్యలక్ష్మి.
ఇక భరత్ అంత్యక్రియలకు వెళ్లాకపోవడంకు కారణం కుటుంబ ఆచారమే అని చెప్పింది. భరత్ ను మంచి దారిలో పెట్టేందుకు రేయింభవళ్లు కనిపెట్టుకుని ఉండేదాన్నని, చనిపోయేందుకు కొద్దిరోజుల ముందే భరత్ అన్ని మానేశాడని,బిగ్ బాస్ లో అవకాశం రావటంతో ఇక అన్ని సర్థుకున్నట్లే అని భావించిన వేళ రోడ్డుప్రమాదానికి గురి కావటం మా దౌర్భాగ్యమని చెప్పింది రాజ్యలక్ష్మి. భరత్ చనిపోవడానికి మద్యం కారణమనే వార్తలో కూడా వాస్తవం లేదని పేర్కొంది. ఇక రవితేజతో భరత్ జీవితాన్ని ముడిపెట్టద్దని సూచించింది రవితేజ తల్లి రాజ్యలక్ష్మి.
https://www.youtube.com/watch?v=0Xoy84SehyA
