Thursday, May 2, 2024
- Advertisement -

ప్ర‌జా ప్ర‌తినిధుల బ‌లాలు,బ‌ల‌హీన‌త‌ల‌పై స‌ర్వే చేయిస్తున్న బాబు

- Advertisement -

ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడిలో అంత‌ర్మ‌థ‌నం మొద‌ల‌య్యింది.ప్ర‌స్తుతం బాబు ఎవ‌రిని న‌మ్మ‌ని ప‌రిస్థితి.చివ‌రికి సొంత‌పార్టీనేత‌ల‌ను కూడా న‌మ్మేస్థితో సీఎంగారు లేరు.సార్వ‌త్రిక ఎన్నిక‌లకు ఇంకా స‌మ‌యం ఉన్నా ఇప్ప‌టినుంచే భ‌యం మొద‌ల‌య్యింది.అందుకే ప్ర‌తి ప‌క్ష‌పార్టీ ప్ర‌జాప్ర‌తినిధులపై ర‌హ‌స్య‌నిఘాను పెట్టిన‌ట్లు స‌మాచారం

వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఒక్కసీటు కూడా రాకుండ ప్ర‌తిప‌క్షమే అన్న‌తి లేకుండా చేయాల‌నిచంద్రబాబు ఆలోచన. మనది ప్రజాస్వామ్యదేశం కాబట్టి చంద్రబాబు అనుకున్నట్లుగా జరిగే అవకాశం లేదనకోండి. కానీ ఆ కోరిక మాత్రం చంద్రబాబులో బలంగా ఉంది. అందుకే పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించారు.

వైసీపీ ఎంఎల్ఏలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఆ ఎంఎల్ఏల పనితీరు ఎలాగుందనే విషయమై సర్వే జరిపిస్తున్నారట. వైసీపీ ఎంఎల్ఏల పనితీరు, వారి బలాలు, బలహీనతలు అన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేయిస్తున్నారట. ఎందుకంటే, వచ్చే ఎన్నికలు ఎంతో దూరంలో లేవుకదా? మరి, టిడిపి తరపున పోటీలోకి దింపాల్సిన గట్టి నేతలెవరో తేల్చుకోవాలంటే ముందు వైసీపీ ఎంఎల్ఏల గురించి అధ్యయనం చేయాలని అనుకున్నారట. అందుకనే, వారి పనితీరుపై నిఘా వేసారు. ఇంటెలిజెన్స్ అధికారులు అదే పనిపైన బిజీగా ఉన్నారట.

వచ్చే ఎన్నికల్లోగా వైసీపీ నుండి టిడిపిలోకి వచ్చే వారెవరైనా ఉంటే వాళ్ళకు రెడ్ కార్పెట్ పరిచేందుకు కూడా చంద్రబాబు సిద్దంగా ఉన్నారు. అందుకు వీలుగానే సొంతజిల్లాలోని మదనపల్లె, పీలేరు లాంటి పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ లను పెట్టలేదు.

వచ్చే ఎన్నికల్లోగా వీలైనంతమందిని దెబ్బ కొట్టగలిగితే టిడిపి ఈజీగా మళ్ళీ విజయం సాధించవచ్చన్నది అధినేత ఆలోచనగా కనబడుతోంది. కోస్తా, ఉత్తరాధ్ర జిల్లాల్లో ఎటూ టిడిపి బలంగానే ఉంది అన్న ఉద్దేశ్యంతో ప్రధానంగా రాయలసీమ ప్రాంతంపైనే చంద్రబాబు దృష్టి పెట్టారట. చూడాలి బాబు న‌క్క‌జిత్తులు ఎంత‌వ‌ర‌కు ప‌నిచేస్తాయో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -