Sunday, May 19, 2024
- Advertisement -

బాబు చ‌రిత్ర‌లోనే 12మంది ఇంఛార్జీ‌లను నియమించిన దాఖలాలు అరుదు..

- Advertisement -

ఏపీ సీఎం ‌బాబు నాయుడికి నంద్యాల ఉప ఎన్నిక భ‌యం ఊపిని ఆడ‌నీయ‌కుండా చేస్తోంది.అందుకనే రోజుకో నిర్ణయం తీసుకుంటున్నారు. నంద్యాల ఉపఎన్నిక విషయంలో చంద్రబాబు తాజాగా తీసుకున్న సంచలన నిర్ణయం రాజ‌కీయ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తోంది.చంద్ర‌బాబు చ‌రిత్ర‌లోనే ఇలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

నంద్యాల ఉప ఎన్నికలో ఎలాగైనా తమ జెండానే నంద్యాలపై రెపరెపలాడించాలని టీడీపీ, వైసీపీ అధినేతలు పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. కాగా ఇప్పటికే వైసీపీ పార్టీ శ్రేణులు నంద్యాలలో ప్రచారం చేస్తుండ‌గా…మరోవైపు టీడీపీ అభ్యర్థి తరఫున మంత్రులు కూడా నంద్యాలలోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు.

నంద్యాల ఉపఎన్నికలో గెలిచి తీరాల‌ని ఏకంగా 12 మంది ఎంఎల్ఏలను ఎన్నికల ఇన్ఛార్జీలుగా నియమించారు. గతంలో ఎన్నడూ ఏ ఎన్నిక కోసం కూడా చంద్రబాబు ఈ స్దాయిలో 12 మందిని నియమించలేదు. రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొన్న తర్వాత చంద్రబాబు ఎంఎల్ఏలతో సచివాలయంలోని తన ఛాంబర్లో భేటీ అయ్యారు. కేవలం నంద్యాల ఉపఎన్నిక గురించే దాదాపు గంటకుపైగా చర్చించారు.అనుస‌రించాల్సిన వ్యూహాల‌పై లోతుగా చ‌ర్చించారు.

చ‌ర్చ అనంత‌రం నిమ్మల రామానాయుడు, బోండా ఉమా, బోడె ప్రసాద్ కాకుండా మరో తొమ్మిదిని నియమిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. ఈ 12 మంది ఎంఎల్ఏలను మండలానికి ముగ్గురు చొప్పున పనిచేయాలని ఆదేశించారు. ఉపఎన్నికల షెడ్యూల్ వెలువడగానే ఎంఎల్ఏలందరూ కార్యాచరణలోకి దిగాలంటూ చంద్రబాబు అందరినీ ఆదేశించారు.

ఇప్పటికే అనేకమంత్రి మంత్రులు ప్రతిరోజు నంద్యాలో పర్యటిస్తున్నారు. వీరికి అదనంగా మళ్ళీ ఎంఎల్ఏలను నియమించారు. అవసరమైతే మరింతమంది ఎంపిలను కూడా రంగంలోకి దింపాలని అనుకుంటున్నారట. ఇంతమందిని నియోజకవర్గంలోకి దింపితే జనాల ప‌రిస్థితి ఏంట‌నే వాద‌న వినిపిస్తోంది. 12 మంది ఇంఛార్జీలు గురువారం నుంచి రంగంలోకి దిగనున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -