సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ ల కాంబినేషన్ లో వెనుకటికి ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో కొన్ని సూపర్ హిట్స్ అయ్యాయి. అలాంటి వాటిలో మిస్సమ్మ, మాయబజార్, గుండమ్మ కథ వంటి సినిమాలు ముఖ్యమైనవి.
మరి ఆ తర్వాత ఈ కుటుంబాల రెండోతరంలో కూడా కొన్ని సినిమాలు వచ్చాయి. నాగేశ్వరరావుతో బాలయ్య కొన్ని సినిమాలు కలిసి నటించాడు. అలాగే నాగార్జున, హరికృష్ణ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా వచ్చింది.
మరి నందమూరి, అక్కినేని కుటుంబాల్లో మూడోతరం కాంబినేషన్ లో కూడా సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయిప్పుడు. జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్యల కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా ప్రతిపాదన దశలో ఉంది. విశేషం ఏమిటంటే.. ఈ సినిమా కు కల్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించనున్నాడనే వార్త రావడం. వీవీ వినాయక్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. తారక్, చైతూల కాంబినేషన్ లో వచ్చే సినిమా అలనాటి ‘గుండమ్మకథ’కు రీమేక్ అని వార్తలు వస్తున్నాయి. మరి ఈ కాంబినేషన్ లో సినిమా ఏ మేరకు పట్టాలెక్కుతుందో… అలనాటి క్లాసిక్ ను ఈ తరానికి అనుగుణంగా ఎలా తీర్చిదిద్దుతారో చూడాలి!