- Advertisement -

ఒక్క పూట తిండి కోసం డ్యాన్సర్ గా మారిన ముమైత్ ఖాన్…

- Advertisement -

ఇప్పుడు సినీ నటిగా, సెలబ్రిటీగా, ఐట‌మ్‌గ‌ర్ల్ అంటె ప్రేక్ష‌కుల‌కు ముందుగా గుర్తుకొచ్చేది ముమైత్ ఖాన్.ఐట‌మ్ సాంగ్స్‌లో న‌టించిందంటె ధియేట‌ర్‌లో ప్రేక్ష‌కుల నీరాజ‌నాలె.కాని ఇప్పుడు సిన‌మాలులేక అల్లాడుతున్న ముమైత్‌కు డ్ర‌గ్స్‌కేసు మ‌రిన్ని చిక్కులు తెచ్చి పెట్టేలా ఉంది.అస‌లు ముమైత్‌ఖాన్ జీవితం గురించి తెలుసుకుంటె ఎవ‌రైనా సానుభూతి తెల‌పాల్సిందే.

ముమైత్‌ఖాన్‌కు ఒకప్పుడు పూట తిండి కూడా లేని దుర్భర పరిస్థితులను అనుభవించిందంటే నమ్మగలరా? ఆమె సినీ ప్రస్థానం ఎలా మొదలైందో తెలుసా? ఆమె జీవితంపై కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుంటె గుండె బ‌రువెక్కాల్సిందే.

ముమైత్ తల్లి పాకిస్థానీ, తండ్రి తమిళియన్. ఎన్నో సంవత్సరాల క్రితమే ముమైత్ తాత పాక్ నుంచి ముంబై ప్రాంతానికి వలస వచ్చి నివాసం ఏర్పరచుకున్నాడు. ఆపై కూతురు నచ్చిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. వారికి ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు. వారిలో పెద్దమ్మాయే ముమైత్ ఖాన్. పిల్లల పెంపకం భారం కాగా, తండ్రి బాధ్యతను పంచుకునేందుకు ముమైత్ చిన్నతనంలోనే నెలకు రూ. 1500 జీతానికి ఓ డ్యాన్స్ ట్రూప్ లో చేరింది. అక్కడే ఆమె తన ప్రతిభ బయటపడింది.

అప్పుడేసినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యేలా చేసింది. మైమైత్ సోదరి జోగిన్ ఖాన్ కూడా నాట్యంలో సిద్ధహస్తురాలే. ఆమె కొన్ని తమిళ చిత్రాల్లో నటించింది కూడా. పూరీ జగన్నాథ్ తీసిన ‘పోకిరి’ చిత్రంలో ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అనే ఐటమ్ సాంగ్ ప్రేక్ష‌కుల‌ను ఎంత ఉర్రూత‌లూగించిందో తెలుసు.అదేముమైత్ ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేయగా, ఆపై ఎన్నో అవకాశాలు ఆమె తలుపు తట్టాయి.

ముమైత్‌ఖాన్ ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 40 వరకూ హిందీ, తెలుగు, కన్నడ చిత్రాల్లో ఆమెకు అవకాశాలు లభించాయి. ముక్కుసూటిగా మాట్లాడే తత్వమున్న ముమైత్ ఖాన్ ను ఇప్పుడు సిట్ అధికారులు విచారిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -