Monday, May 20, 2024
- Advertisement -

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల…ఇక దూకుడే….

- Advertisement -

పీలో రాజకీయ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన నంద్యాల ఉప ఎన్నిక న‌గారా మోగించి. ఎన్నిక షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల కోడ్‌ నేటి నుంచే అమల్లోకి వస్తుందని పేర్కొంది.

షెడ్యూల్‌ వివరాలు..
ఈ నెల 29 నుంచి ఆగస్టు 5 వరకు నామినేషన్ల స్వీకరణ
ఆగస్టు 7న నామినేషన్ల పరిశీలన
నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఆగస్టు 9
ఆగస్టు 23న ఉపఎన్నిక
ఆగస్టు 28న ఓట్ల లెక్కింపు, ఫలితం వెల్లడి

సిట్టింగ్‌ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి మృతితో నంద్యాలలో ఉప ఎన్నికజరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెదేపా నుంచి భూమా నాగిరెడ్డి సోదరుడి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి, వైకాపా తరపున శిల్పా మోహన్‌రెడ్డి పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో వైకాపా నుంచి గెలిచిన భూమా నాగిరెడ్డి అనంతరం తెదేపాలో చేరారు. దీంతో ఆ స్థానం తమదేనంటూ వైకాపా అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించింది. వైఎస్‌ చనిపోయినప్పుడు తాము అభ్యర్థిని నిలబెట్టలేదని.. అదే సంప్రదాయం కొనసాగించాలని తెదేపా చేసిన విజ్ఞప్తిని వైకాపా తిరస్కరించింది. దీంతో నంద్యాలలో ఉప ఎన్నిక అనివార్యమైంది.

మొత్తం మీద నంద్యాలలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల వ్యూహాప్రతివ్యూహాలు మరింత పదునెక్కే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -