Wednesday, May 15, 2024
- Advertisement -

ఎన్‌డీఏకు కొత్త‌మిత్రులు…బాబు అవ‌స‌రం తీరిన‌ట్టేనా…?

- Advertisement -

చంద్ర‌బాబు నాయుడికి గ‌డ్డు ప‌రిస్థిత‌లు దాపురిస్తున్నాయి.మున్ముందు మ‌రిన్ని క‌ష్లాలు చుట్టుముట్ట‌నున్నాయి.ఇన్నాల్లు కేంద్రం ఆదుకుంటాద‌ని గొప్ప‌లు చెప్పుకున్న బాబ‌కు మోదీ షాక్ ఇస్తున్నారు.మొద‌టినుంచి చంద్ర‌బాబును న‌మ్మ‌లేదు..కాని వెంక‌య్య‌నాయుడు అండ‌తో బాబు ప‌ప్పులు ఉడికాయి.కాని ఇప్పుడు జిమ్మిక్కులు కుద‌ర‌వు.

ఢిల్లీకి వెల్లిన చంద్ర‌బాబుకు అనుకోని ప‌రిస్థితులు ఎదుర‌య్యాయి.మోదీని క‌లుసుకోకుండానె ఏపీకి ప‌య‌న‌మ‌య్యారు.అవినీతి పై పోరాటం’లో భాగంగానే నితీశ్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారని ప్రధాని ప్రశసించారు.మ‌రొక‌టి తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌ధాని మోదీని క‌లిశారు. అయితేఢిల్లీ యాత్రను చంద్రబాబు అసంపూర్ణంగా వదిలేసుకుని వచ్చారు. కెసిఆర్ లాగా ఆయన ప్రధాని కలవలేదు. హోంమంత్రిని కలిసి వచ్చేశారు. ఎందుకుఅనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.

రాజ‌కీయాలు చేయ‌డంలొ బాబు దిట్ట‌.ఫిరాయింపులను ఖండించగలరు, అటు తిరిగి సమర్థించగలరు. ఆంధ్ర కు ప్రత్యేక హోదాకావాలని చెప్పగలరు, హోదా కంటే ప్యాకేజీ పవిత్రమయిందని చెప్పగలరు. ఇలాంటి శక్తి ఉన్నందునే ఆయన ఢిల్లీ రాజకీయాల వాసన పసిగట్టారు. ఇక్కడేదో జరుగబోతున్నదని వూహించినట్లున్నారు. వెంటనే విజయవాడ విమానమెక్కారు. అక్కడేమో కెసిఆర్ శుభ్రంగా అందరితో కలసి, చల్లటి ఢిల్లీ చిత్తడి లో వేడివేడి చాయ్ సిప్ చేసి తనదై రాజకీయం చడీ చప్పుడు లేకుండా చేసుకుంటు పోయారు.

ఢిల్లీ వెళ్లి, పెండింగులో ఉన్న విషయాలను పబ్లిక్ కోసమయినా మాట్లాడాలని బాబు ఎందుకనుకోలేదు. ప్రధాని వూర్లోఉన్నా ఒక ఏకాంత సమావేశం కోర లేదు.ఎన్డీయేకి బాబు అవసరం తీరిపోతున్నదని రాజకీయ పండితులు చెబుతున్నారు. కెసిఆర్ దగ్గిరయ్యాక, నితిష్ స్నేహ హస్తం అందాక చంద్రబాబు అవసరం లేద‌నె చెప్ప‌వ‌చ్చు.

నితీశ్ కుమార్ రాజీనామా అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న (తాను చేస్తున్న) పోరాటంలో భాగమవుతుందని అన్నారు. స్వాగతం అన్నారు.ఇ దే అవినీతి కోణం లోనుంచే చంద్రబాబుని కూడా మోదీ చూసి వదులుకోవాలనుకుంటున్నారా?అమరావతి అవినీతి గురించి ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నుంచి రాష్ట్రపతి దాకా డాక్యుమెంట్లను సమర్పించారు. ఢిల్లీలో పెద్ద క్యాంపెయినే చేశారు. అమరావతి చుట్టు ‘ఇన్ సైడర్ ట్రేడింగ్’లో టిడిపి పెద్దోళ్లు భూములు కొన్న వివరాలు అందించారు. ఇంక కాంట్రాక్టుల వివరాలను కూడా అందించారు. బిజెపి వ్యవహారానికి వస్తే, విష్ణుకుమార్ రాజు వైజాగ్ భూముల కుంభకోణం వివరాలను కేంద్రానికి పంపించారు. ఇన్ని అవినీతి ఆరోప‌న‌ల చిట్టా మోదీ ద‌గ్గ‌ర ఉన్న‌ప్పుడు బాబుకు చిక్కులే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -