- Advertisement -

పవన్ కళ్యాణ్ కి పోటీ ఇవ్వబోతున్న బాలయ్య

- Advertisement -

ఈ సంవత్సరం మొదట్లో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణల మధ్య పోటీ జరిగింది. ఖైదీ నంబర్ 150 , గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలు రెండూ సూపర్ హిట్ అయ్యాయి. మంచి సక్సెస్ సాధించాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా బాలకృష్ణ బరిలోకి దిగుతున్నారు. అయితే ఈసారి మెగాస్టార్ తో కాకుండా పవర్ స్టార్ తో బాలకృష్ణ పోటీ పడనున్నాడు.

ఎందుకంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న మూవీ 2018 జనవరి 10 న రిలీజ్ కానున్నట్లు సినిమా యూనిట్ స్పష్టం చేసింది. దాంతో సంక్రాంతికి వద్దామనుకున్న రామ్ చరణ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. సూకుమార్ డైరెక్షన్ లో చరణ్ రంగస్థలం 1985 సినిమా చేస్తున్నాడు. దీన్ని పెద్ద పండుగకు రిలీజ్ చేయాలనికున్నారు. కానీ పవన్ కళ్యాణ్ సినిమాకి పోటీ రావడం ఇష్టం లేక పోస్ట్ పోన్ చేసుకున్నారు.

అలానే మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న భరత్ అనే నేను సినిమా సంక్రాంతికి రావటం లేదని తెలిసింది. సో పవన్, బాలకృష్ణ మధ్య వార్ డిసైడ్ అయిపోయింది. మరి ఏ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -