Saturday, May 18, 2024
- Advertisement -

జేసీ….. ఎంపీ ప‌ద‌వికి రాజీన‌మానా..?టీడీపీలో క‌ల‌క‌లం…..

- Advertisement -

అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డి చేసిన తాజా వ్యాఖ్య‌లు జిల్లాతోపాటు టీడీపీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. జిల్లాలో స్టాండింగ్ క‌మిటీ స‌మావేశంలో జేసీ వ‌ర్గానికి చెందిన కార్పొరేట‌ర్ మీద దాడిచేయ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌యిన‌ట్లు తెలుస్తోంది. తన సభ్యత్వానికి రాజీనామచేయబోతున్నారనే వార్త కలకలం సృష్టిస్తున్నది.

చంద్ర‌బాబుతో విబేధాలు లేకున్నా నియేజ‌క‌వ‌ర్గంలో సొంత పార్టీ నేత‌ల‌తో విబేధాలు భ‌గ్గుమంటున్నాయి. స్థానికంగా తెలుగుదేశం కమ్మవారితో ఆయనకు తంటా వచ్చి పడుతున్నది తప్ప ముఖ్యమంత్రితో చెప్పుకోదగ్గ సమస్యలేవీ లేవుగదా అని అనిపిస్తుంది. మరీ ఆయన ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు?

తెలుగుదేశం ప్రభుత్వ హాయాంలో ఎంపిగారి నియోజకవర్గం అన్యాయానికి గురువుతున్నదని నిరసనగా లోక్ సభ సభ్యత్వానికి రాజీనామా చేస్తారట. వచ్చేపార్లమెంటు సమావేశాలలో ఆయన రాజీనామా పత్రాన్ని నేరుగా స్పీకర్ సుమిత్రా మహాజన్ కుఅందచేస్తారట, అదికూడా లోక్ సభలోనే. అయితే దీని వెనుక పెద్ద సీక్రెట్ ఉందంటున్నారు.

ఎన్నికల పుడు, తర్వాత పర్యటనల్లో ప్రతిచోటా చెరువులను నీళ్లతో నింపిస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికలు దగ్గరపడుతున్నా ఈ హామీ పూర్తిగా నెరవేరడం లేదు. ఈ చెడ్డపేరొస్తున్నదని ఆయన ఆందోళన చెందుతున్నారట. అందువల్ల ఎంపి పదవికి రాజీనామాచేసి నిరసన వ్యక్తం చేయాలనుకుంటున్నారని డిడిపి వర్గాల్లో ఒకటే చర్చ జ‌రుగుతోంది.

అయితె ఎంపీ ప‌ద‌విలో ఉన్న త‌మ నాయ‌కుడి మాట చెల్ల‌న‌పుడు పార్టీలో ఉండి ప్ర‌యేజ‌నం ఏంట‌ని అనుచ‌ర వ‌ర్గం ప్ర‌శ్నిస్తున్నారు. అన్ని విషయాలు కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే జేసీ రాజీనామా చర్చ గురించి ఇంకా ఎక్కడ వివరణ ఇవ్వలేదు. వచ్చే ఎన్నికలలో పోటీ చేసేది లేదని చాలా సార్లు స్పష్టం చేశారు. ఈ రాజీనామా పోరాటం ద్వారా ఆయన 2019లో పోటీచేయనున్న తన కుమారుడికి గుడ్ విల్ సంపాయించేందుకు ఈ ఎత్తుగడ వేస్తున్నానడని టీడీపీ లోని ఒక వర్గం చెబుతున్నది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -