- Advertisement -

ట్విట్టర్ రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్

- Advertisement -

జన సేన అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఇప్పుడు మరో రికార్డ్ సృష్టించారు. హీరోగా సినీ కెరీర్ ను మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్.. అతనికంటూ.. ప్రత్యేకమైన అభిమానులను సంపాధించుకున్నాడు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన పార్టీ కోసం పని చేసిన సంగతి తెలిసిందే.

ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత తనే సొంతంగా ప్రజల తరఫున ప్రశ్నించేందుకు అంటూ జనసేనను మొదలు పెట్టారు. పార్టీ పెట్టిన తర్వాత ఇటు సినిమాలు అటు రాజకీయాలను బ్యాలెన్స్ చేస్తూ తన అభిప్రాయాలను పంచుకోవడానికి సినీనటుడు పవన్ కల్యాణ్ ట్విట్టర్ ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. ఇలా రాజకీయాలు.. సినిమాలు.. అభిమానులు.. ఇవన్నీ క్రమంగా బ్యాలెన్స్ చేస్తున్న నెపథ్యంలో ఆయనకు మరో రికార్డు దక్కింది. పవన్ క్షేత్రస్థాయి కంటే ట్విట్టర్ ద్వారానే అభిమానులకు – పార్టీ శ్రేణులకు ఆయన అందుబాటులో ఉంటున్నారు. ఏ విషయం గురించి అయిన విమర్శించాలన్నా.. శుభాకాంక్షలు చెప్పాలన్నా.. ఉద్యమానికి పిలుపునివ్వాలన్నా ఆయన ట్విట్టర్ నే వేదికగా చేసుకుంటున్న విషయం తెలిసిందే.

దీంతో ఆయనను ట్విట్టర్ లో ఫాలో అవుతున్నవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. తాజాగా ట్విట్టర్ లో పవన్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 20 లక్షల మందికి చేరింది. ఈ సంగతిని ట్విట్టర్ ద్వారానే పవన్ తెలపడం విశేషం. పార్టీ కార్యక్రమాలు రాబోయే కాలంలో మరింత పెంచనున్నారని వార్తల నేపథ్యంలో జనసేనాని ఫాలోవర్ల సంఖ్య మరింతగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -