Saturday, May 18, 2024
- Advertisement -

ఎంజీ రామచంద్రన్‌, ఎంఎస్ సుబ్బుల‌క్ష్మిల‌ జ్ఞాపకార్థంగా వారి 100వ‌ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా విడుద‌ల‌

- Advertisement -

నోట్ల ర‌ద్దుత‌ర్వాత కేంద్రం మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోబోతంది. రూ.200 నోటుల‌ను మార్కెట్‌లోకి తెచ్చిన ఆర్థిక‌శాఖ ఇప్పుడు తాజ‌గా రూ.100 నాణేల‌ను మార్కెట్‌లోకి విడుత‌ల చేయ‌నుంది. త్వరలో ఆర్థిక విప‌ణిలోకి నాణేల‌ను విడుద‌ల చేసేందుకు ఆర్థిక శాఖ సిద్ధ‌మైంది.

ఎంజీ రామచంద్రన్‌, ఎంఎస్ సుబ్బుల‌క్ష్మిల‌ జ్ఞాపకార్థం వారి 100వ‌ జ‌న్మ‌దినం సంద‌ర్భంగా రూ. 100, రూ. 5, రూ. 10 నాణేల‌ను ముద్రిస్తున్నట్లు ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. రూ. 100 నాణెం వ్యాసం 44 మిల్లీమీటర్లుగా ఉంటుందని తెలిపింది. అలాగే నాలుగు సింహాల అశోకుని స్థూపం బొమ్మ కూడా నాణెం మీద ముద్రించ‌నున్న‌ట్లు చెప్పింది. కొన్ని నాణెల‌ను ఎంజీఆర్ బొమ్మ‌తో, మ‌రికొన్నింటిని ఎంఎస్ సుబ్బులక్ష్మి బొమ్మ‌ను నాణెం వెనుక భాగంలో ముద్రిస్తామ‌ని తెలిపింది.

నూరు పూయాల నాణేల బరువు 35 గ్రాములు ఉండ‌నుంది. దీన్ని త‌యారు చేయ‌డానికి వెండి, రాగి, నికెల్‌, జింక్‌ల మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. అలాగే రూ. 10 నాణెం మీద సుబ్బుల‌క్ష్మి బొమ్మ‌ను, రూ. 5 నాణెం మీద ఎంజీఆర్ బొమ్మ‌ను ముద్రిస్తామ‌ని వివ‌రించింది. ఎంజీ రామచంద్రన్‌ జయంతి సందర్భంగా కాయిన్స్‌, పోస్టల్‌ స్టాంపులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -