సచ్చిందిరా గొర్రె.. అనే పదంను ఎక్కువగా తెలంగాణలో వినిపించే పదం. ఎవరైన ఏదైన సమస్యలో పడ్డారంటే.. సచ్చిందిరా గొర్రె అనేస్తారు. అలానే ఎవరైన తప్పటడుగు వేసినా కూడా.. వారిని అలా తిడుతుంటారు. ఇప్పుడు ఇదే మాటను టైటల్ గా మార్చేశారు. అనసూయ లీడ్ లో పెట్టి.. ఈ మూవీని తెరకెక్కుస్తున్నారు.
కొత్త డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి యర్వా దర్శకత్వంలో.. అనసూయతో పాటు.. శ్రీనివాస్ రెడ్డి.. శివా రెడ్డి.. శకలక శంకర్ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తూ చేస్తున్న సినిమా సచ్చిందిరా గొర్రె. ఈ సినిమాలో అనసూయది లీడ్ క్యారక్టర్ అని చెప్పలేం కాని.. ఈ సినిమాలో తన పాత్ర పరిధి ఎంత ఏంటి అనేది చూసుకోలేదు అంటోంది ఈ హాట్ యాంకర్. ఎందుకంటే అమ్మడు కేవలం లీడ్ రోల్స్ మాత్రమే చేస్తానంటూ మడికట్టుకుని కూర్చోలేదట.. పాత్ర బాగుంటే ఎలాంటి రోల్ అయినా చేసేస్తాను అంటోంది. అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదో థ్రిల్లర్ కామెడీ సినిమాట.
ఇకపోతే.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. వివరాలు బయటకు చెప్పకుండా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. మొత్తానికి మొన్నటివరకు లీడ్ రోల్స్ అనుకుని.. ఆ తర్వాత సాంగ్స్.. ఆ తరువాత సైడ్ క్యారెక్టర్స్ కు కూడా ఓకే చేస్తోంది అనసూయ. మరి అనసూయ.. ఈ సచ్చిందిరా గొర్రె సినిమాతో ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.