- Advertisement -

‘మహానుభావుడు’ ప్రీ-రివ్యూ

- Advertisement -

జై లవ కుశ, స్పైడర్ మూవీస్ పై భారీ అంచనాలు.. మధ్య వచ్చాయి. ఇక మిగిలింది ఇప్పుడు ‘మహానుభావుడు’. ఈ సినిమా టీజర్, ట్రైలర్స్ కామెడీ పుష్కలంగా ఉందని యూనిట్ తెల్చేసింది. పైగా.. హీరోకి ‘ఓసిడి’ అనే వ్యాధి వుండటం మరో మేజర్ ప్లస్ పాయింట్. దర్శకుడు మారుతి ఆల్రెడీ ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలో హీరోకి ‘మతిమరుపు’ డిజార్డర్ పెట్టి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే తరలో ‘ఓసీడీ’ డిజాస్టర్‌తో వస్తున్నాడు.

దీంతో ఈ సినిమా కూడా ‘భలే భలే’గా వుండొచ్చని జనాలు బ్లైండ్‌గా ఫిక్స్ అయిపోయారు. కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడం ఖాయంలా అనిపిస్తోంది. ‘మహానుభావుడు’ హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్‌గా వుందని టాక్ వినిపిస్తోంది. పరిశ్రమ వర్గాల నుంచి వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ సినిమా కథ.. ఓసిడి వ్యాధితో బాధపడే హీరో శర్వానంద్ పరమ నీటుగాడు. చివరికి పెన్‌కి క్యాప్ లేకపోయినా.. వెతికిమరీ దానికి పెట్టేస్తాడు. తనది కాకపోయినా సరే.. నీట్‌గా ఏది కనిపించపోతే దాన్ని సర్దేస్తాడు. అంతెందుకు.. తల్లికి జర్వమొచ్చినా పట్టించుకోకుండా ఆమెకి అమడదూరంలో వుంటాడు. ఇతని పరమశుభ్రతని చూసి చాలామంది రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అయితే.. అతనిలో వున్న ఆ డిజార్డర్‌ని చూసే హీరోయిన్ మెహ్రీన్ ప్రేమలో పడుతుంది. తన ఫ్యామిలీకి ఎలాగోలా ఒప్పిస్తుంది. కట్ చేస్తే.. ఏ వ్యాధిని చూసి మెహ్రీన్ అతడ్ని ప్రేమిస్తుందో, అదే ఆమె మనోభావాల్ని దెబ్బతీస్తుంది.

దాంతో.. ఆమె అతనికి దూరం అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? శర్వానంద్ తిరిగి తన ప్రేమను పొందేందుకు ఏం చేశాడు? అనేది కథ. ఈ సినిమా మొత్తం కామెడీతో నిండిందని.. చివరివరకు హిలేరియస్‌గా థియేటర్లో నవ్వుకుంటారని.. వార్తలొస్తున్నాయి. ఇక హీరో తనకున్న డిజార్డర్‌తో నవ్విస్తే.. పక్కనే వుండే వెన్నెల కిషోర్ తనదైన శైలి హాస్యంతో తెగ నవ్విస్తాడట. హీరో-హీరోయిన్ మధ్య సీన్స్ కూడా రొమాంటిక్ గా ఉన్నాయట. ఇక ఫ్యామిలీ ఆడియెన్స్‌ని టచ్ చేసే ఎమోషన్స్ కూడా పీక్స్‌లో వున్నాయని సమాచారం. కామెడీ ఎంటర్టైనర్‌గా మూవీ పక్కా హిట్ అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -