- Advertisement -

మరోసారి చేయి చేసుకున్న బాలయ్య.. ఎవరి మీదానో తెలుసా ?

- Advertisement -

ప్రముఖ హీరో.. టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరో సారి వార్తల్లోకి ఎక్కారు. బాలయ్య మరోసారి తన చేతికి పని చెప్పారు. గతంలో బాలయ్య సినిమా షూటింగ్ లో తన అసిస్టెంట్ తన శాండిల్స్ విప్పలేదని.. కొట్టిన విషయం అందరికి తెలిసిందే. ఆ టైంలో ఆ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.

ఇటివలే జరిగిన నంద్యాల ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా టీడీపీ కార్యకర్త పై చెయ్యి చేసుకొని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు తాజాగా హిందూపురం నియోజకవర్గంలో పర్యటిస్తున్న బాలకృష్ణ అక్కడ ఓ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. హిందూపురంలోని బోయపేటలో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో బాలకృష్ణతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నెపథ్యంలో ఆయన ఓ ఇంట్లోకి వెళుతుండగా.. బాలయ్య కంటే ముందు ఓ కార్యకర్త వెళ్లడానికి ప్రయత్నం చేశాడు.

దీంతో బాలయ్య అసహనంతో ఆ కార్యకర్త చెంప చెళ్లుమనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను టీడీపీ కార్యకర్తలు ఆన్ లైన్ లో పెట్టారు. ఇలా వరుసగా బాలయ్య బాబు దురుసు ప్రవర్తనతో ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -