ప్రకాశం జిల్లాలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న బూచేపల్లి కుటుంబం.. ఇప్పుడు రాజకీయాల నుండి తప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే విషయంపై ఆలోచనలో ఉన్నట్లు ఆయన సన్నిహితుల్లో ప్రచారం సాగుతోంది. ప్రకాశం జిల్లాలో బూచేపల్లి కుటుంబానికి మంచి ప్రత్యేకత ఉంది. బూచేపల్లి శివప్రసాద్ తండ్రి సుబ్బారెడ్డి, శివప్రసాద్ రెడ్డి ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించారు.
ప్రకాశం జిల్లా రాజకీయాల్లో వీరిది కీలక పాత్ర. అయితే బూచేపల్లి కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల నుండి తప్పుకోవాలని భావించడం వెనుక అనేక కారణాలున్నాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ప్రత్యక్ష రాజకీయాలకు బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి దూరం కావాలనే యోచన ఉన్నట్లు ఆయన సన్నిహితుల్లో ప్రచారంలో ఉంది. అయితే ఇదే విషయంపై ఇంకా ఆయన ఏ నిర్ణయం తీసుకోలేదంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని ఆ కుటుంబానికి చెందిన డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంను మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి.. జగన్ దృష్టికి తీసుకెళ్ళారని ప్రచారం సాగుతోంది.
అయితే జగన్ కు చెప్పిన తర్వాత ప్రత్యామ్నాయంపై దృష్టి సారించాలని జిల్లా నేతలకు సూచించినట్లు ప్రచారం సాగుతోంది. శివప్రసాద్‌రెడ్డి తండ్రి బూచేపల్లి సుబ్బారెడ్డి వైఎస్ సారథ్యంలో కాంగ్రెస్‌లో చేరిన తర్వాత 2009లో ఆయన స్థానంలో రెండో కుమారుడైన శివప్రసాద్‌రెడ్డి అదే నియో జకవర్గం నుంచి పోటీ చేసి సుమారు 12వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. గత ఎన్నికల్లో తిరిగి పోటీ చేసిన శివప్రసాద్‌రెడ్డి సుమారు 1200 ఓట్ల స్వల్ప తేడాతో శిద్దా రాఘవరావు చేతిలో ఓటమి చెందారు.
