రిలయన్స్ జియో 4జీ టెలికం మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత పలు టెలికం కంపెనీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ప్రధానంగా టెలికం దిగ్గజం ఎయిర్ టెల్, రిలయన్స్ జియో మధ్యనె వార్ కొనసాగుతోంది. జియో తీసుకొస్తున్న కొత్త ఆఫర్లకు …. ఎయిర్‌టెల్ రోజుకో కొత్త ప్రకటనతో జియోకు కౌంటర్ ఇస్తోంది. తాజాగా తొలిసారి 4జీ యూజర్ల కోసం రూ.1,399తో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన ఎయిర్‌టెల్, తాజాగా మరో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది.
కొత్త ప్లాన్ కింద 50జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ను ఎయిర్‌టెల్ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. రోమింగ్ ఇన్‌కమింగ్ కాల్స్, రోమింగ్ అవుట్‌గోయింగ్ కాల్స్ కూడా ఈ ప్లాన్ కింద అపరమితమే. ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ ప్లాన్ కొత్త, పాత యూజర్లందరికీ అందుబాటులో ఉంటుందని, వాడుకోని డేటాను వచ్చే బిల్లింగ్ సైకిల్‌కు పంపించుకునే వెసులుబాటు కూడా ఉందని పేర్కొంది.
గత నెల సెప్టెంబర్‌లో ప్రీపెయిడ్ యూజర్ల కోసం కూడా కంపెనీ రూ.999 ప్యాక్‌ను లాంచ్ చేసింది. ఆ రీఛార్జ్ కింద రోజుకు 4జీబీ డేటా చొప్పున 112జీబీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. పోస్టుపెయిడ్ యూజర్లకు తీసుకొచ్చిన ఈ ప్లాన్‌లో ఎలాంటి రోజువారీ పరిమితులు లేవు. ఒక్కసారి 50జీబీ డేటా అయిపోతే, ఒక్కో ఎంబీకి 50 పైసా ఛార్జ్ పడుతోంది. ఇలా రోజుకొ ప్లాన్‌తో జియోకు షాకిస్తోంది ఎయిర్‌టెల్.