Thursday, May 2, 2024
- Advertisement -

గుడ్ న్యూస్.. అంబానీ మరో సంచలన ప్రకటన

- Advertisement -

ఆగస్టు 12. ఈరోజు కోసమే దేశంలోని ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జియోతో దేశవ్యాప్తంగా మొబైల్ ఫోన్ తో డిజిటల్ విప్లవాన్ని సృష్టించిన ముకేష్ అంబానీ తాజాగా జరిగిన 42వ వార్షిక రిలయన్స్ ఇండస్ట్రీస్ సర్వసభ్య సమావేశంలో కీలక ప్రకటన చేశారు. గత ఏడాది లాభాల్లో రిలయన్స్ రికార్డ్ సృష్టించిందని అంబానీ ప్రకటించారు. రిలయన్స్ జియో ఏకంగా 340 మిలియన్ వినియోగదారులను దాటిందన్నారు. జియో భారత ఆర్థిక వ్యవస్థలో ఒక డిజిటల్ విప్లవం తీసుకొచ్చిందని తెలిపారు. ఈ రంగంలో మరింత అభివృద్ధి చోటుచేసుకుందని వివరించారు.

ఇక దేశవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో గిగా ఫైబర్ పై రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేశారు. ఇంటర్నెట్ రంగంలో ఈ ఆర్థిక ఏడాదే మరో విప్లవం తీసుకురాబోతున్నట్టు ప్రకటించారు. ప్రతీ ఒక్కరికి డిజిటల్ టెక్నాలజీని అందిస్తామన్నారు. త్వరలోనే జియోను 5జీకి అప్ గ్రేడ్ చేస్తామన్నారు.

ఇక బ్రాడ్ బ్యాండ్ సేవలైన జియో గిగ్ ఫైబర్ ను సెప్టెంబర్ తర్వాత లాంచ్ చేయబోతున్నట్టు ముఖేష్ అంబానీ చూచాయగా తెలిపారు. జియో ఫైబర్ గ్రిడ్ తో ఇంటర్నెట్ కనెక్షన్ తోపాటు ల్యాండ్ లైన్ కనెక్షన్, డిజిటల్ సెటాప్ బాక్స్ కూడా ఉచితంగా అందజేస్తామని ముఖేష్ అంబానీ సంచలన ప్రకటన చేశారు. ఒక్క కనెక్షన్ తోనే ఇవన్నీ పొందవచ్చని దేశప్రజలకు శుభవార్త చెప్పారు.. త్వరలోనే 1600 పట్టణాలు, 20 మిలియన్ల మందికి ఈ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

ఇక జియో గిగా ఫైబర్ తో కుదేలయ్యే దేశ కేబుల్ ఆపరేటర్స్ కు ముఖేష్ అంబానీ శుభవార్త చెప్పారు. వారందరినీ జియో గిగా ఫైబర్ నెట్ వర్క్ లో భాగస్వాములను చేస్తున్నట్టు ప్రకటించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -