ప్రపంచ దేశాల్లో భారత్ శరవేగంగా అభివృద్ధిచెందుతోందని మన నాయకులు ఉపన్యాసాలు ఊదరగొడుతుంటారు. భవిష్యత్ ఆశా కిరనం భారత్ అని 2030 నాటికి చైనా ఆర్థిక వ్యవస్థను కూడా దాటుతుందని నాయకులందరు చెప్పేమాట. ఇంట గెలిచి రచ్చగెలవాలన్నారు పెద్దులు. కాని మన విషయంలో మాత్రం విరుద్ధం.
భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఒక వైపు చెప్పుకుంటున్నా దారిద్య్రంలో మాత్రం అంతర్జాతీయంగా ప్రతీ సారి మసకబాబుస్తూనె ఉంది. పేవారి ఆకలి తీర్చలేని అభవృద్ది శూన్యంతో సమానం. అభివృద్ధి అంటె ప్రతి వ్యక్తికి ఆరోగ్యం,విద్య,ఆహారం అన్ని అందుబాటులో ఉన్నప్పుడే ఆదేశం అభివృద్ధి దిశగా వెల్తోందని చెప్పుకోవచ్చు. కాని మన దురదృష్టం మాత్రం మన దేశంలో ఆకలి కేకలు తగ్గడంలేదు.
తాజాగా అంతర్జాతీయ ఆహార విధాన పరిశోధన సంస్థ(ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్) ఈ మేరకు ప్రపంచ ఆకలి సూచి పట్టికను ప్రకటించింది. పట్టిక జాబితాలో ప్రపంచ ఆకలి సూచీలో పేర్కొన్న 119 దేశాల్లో భారత్ 100వ ర్యాంకులో నిలిచింది. ర్యాంకు ప్రకారం భారత్ ఉత్తర కొరియా, శ్రీలంక, ఆఖరికి బంగ్లాదేశ్ కంటే కూడా వెనుకబడి ఉంది.
ప్రపంచంలో భారత్‌లోనే ఎక్కువగా పోషకాహారం లేమితో బాధపడుతున్న పిల్లలు, సరైన బరువులేని పిల్లలు ఎక్కువగా ఉన్నారని ఈ సందర్భంగా ఆ నివేదిక పేర్కొంది. 21శాతం ఐదేళ్లలోపు చిన్నారులు పౌష్టికహారలోపంతో బాధపడుతుండటంతోపాటు సరైన బరువు కూడా లేరని వెల్లడించింది.
గతంలో 2016లో 118 దేశాల్లో భారత్‌ది 97 ర్యాంకుకాగా, ఈ ఏడాది మాత్రం శ్రీలంక, బంగ్లాదేశ్‌లు భారత్‌కంటే మెరుగైన ర్యాంకును సాధించాయి. ఇక ఉత్తర కొరియా కూడా గత ఏడాది కూడా భారత్‌కంటే కింద ఉండి ఈ ఏడాది మాత్రం ఏకంగా 93 ర్యాంకుకు దూసుకెళ్లింది.
ప్రపంచ ఆకలి సూచీలో పేర్కొన్న 119 దేశాల్లో భారత్ 100వ ర్యాంకులో నిలిచింది. ప్రస్తుతం భారత్ స్కోర్ 31.4గా ఉంది. ఈ స్కోర్ 28.5కి చేరితే మాత్రం అత్యంత ఆందోళనకరమైన విషయంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇప్పటికైనా గొప్పలకు పోకుండా ముందు ఇంటిని చక్కదిద్దాలి. అందరికి పనికిరాని ప్రజెక్టులకు లక్షల కోట్లు ఖర్చుపెట్టే బదులు అందరికి ఆహారాభద్రత కల్పించే దిశగా మన ప్రభుత్వాలు మందడుగువేయాలి.