Wednesday, May 14, 2025
- Advertisement -

చైతు, సమంత.. రెండుసార్లు రిసెప్షన్..

- Advertisement -

ఈ నెల 6, 7 తేదీల్లో నాగచైతన్య, సమంతల పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. ఈ పెళ్లికి అక్కినేని, దగ్గుబాటి ప్యామిలతో పాటు.. సమంత ఫ్యామిలీ.. కొందరు సినీ ప్రముఖులు ఈ పెళ్లికి హాజరయ్యారు. అయితే రిసెప్షన్ గ్రాండ్ గా ఉంటుందని నాగర్జున ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.

అయితే దీనికి ఎటువంటి ముహూర్తాన్ని ఖరారు చేయలేదు. అయితే సమంత, చైతు లు ఎప్పుడు ఓకే అంటే అప్పుడే రిస్పెషన్ అని నాగ్ తెలిపాడు. అయితే నాగార్జున కామెంట్స్ వల్ల రిసెప్షన్ ఉండదేమో అని అనుకున్నారంతా.. అయితే సమంత, చైతు రిసెప్షన్‌కు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పెళ్లిలానే రిసెప్షన్ కూడా రెండుసార్లు జరగబోతున్నట్టు సమాచారం. ముందుగా సమంత ఫ్యామిలీ సభ్యులు చెన్నైలో ఘనంగా ‘సామ్-చై’ రిసెప్షన్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లలలో నిమగ్నమైనట్టు సమంత సన్నిహితుల ద్వారా తెలుస్తుంది.

ఈ కార్యక్రమానికి అక్కినేని కుటుంబ సభ్యులతో దగ్గుబాటి కుటుంబ సభ్యులు హాజరవుతుండగా.. కోలీవుడ్ కి చెందిన సినీ ప్రముళులు హాజరౌతారని తెలుస్తోంది. అయితే ఆ కార్యక్రమం ముగిసిన తరువాత తిరిగి హైదరాబాద్‌లోని ఇక్కడ అతిథులకోసం గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో పెళ్లితో పాటు రిసెప్షన్ కూడా రెండు సార్లు చేసుకొని సమంత, నాగచైతన్యల జోడి కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టబోతున్నారన్నమాట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -