- Advertisement -

ముఖేష్ అంబానీ డ్రైవర్ జీతం.. ఏడాదికి 24,00,000

- Advertisement -

జియో ప్రారంభంతో ప్రతి రోజూ ఏదోరకంగా వార్తల్లో నిలుస్తున్నాడు అంబానీ. ఆయన కారు డ్రైవర్ విషయంకు వెళ్తే.. సాధారణంగా ఓ డ్రైవర్ నెలసరి వేతనం 15 నుండి 20 వేల వరకు ఉండవచ్చు. అంబానీ వ్యక్తిగత కారు డ్రైవర్ నెలసరి వేతనం ఎంతో తెలుస్తే షాక్ కావాల్సిందే. ప్రపంచ మరియు దేశ ఆర్థిక, వాణిజ్య మరియు పారిశ్రామిక రంగాలలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ముఖేష్ అంబానీ.

ముఖేష్ అంబానీ ఇళ్లు మొత్తం 27 ఫ్లోర్లు కలిగి ఉంది. ఈ 27 లో ఆరు ఫ్లోర్లను అంబానీ కార్లు కోసం కేటాయించాడు. ఈ కార్లన్నీ కూడా ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు. ముఖేష్ అంబానీకి ఎంతో ఇష్టమైన బిఎమ్‌డబ్ల్యూ 760ఎల్ఐ ఆర్మ్డ్ లగ్జరీ కారుతో పాటు సుమారుగా 168 లగ్జరీ కార్లు ఉన్నాయి. ముఖేష్ అంబానీ తన డ్రైవర్‌కు జీతం ఇచ్చినపుడు తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఆ వీడియో ప్రకారం, ముఖేష్ అంబానీ డ్రైవర్‌ నెలకు అక్షరాలా రెండు లక్షల రుపాయల వేతనం అందుకొంటున్నాడు. ఇది కూడా నమ్మశక్యంగా ఉండదు.

ఒక డ్రైవర్‌కు రెండు లక్షలేంటని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇది నిజం. ముఖేష్ అంబానీ కారు డ్రైవర్ నెలకు రెండు లక్షల చెప్పున ఏడాదికి 24,00,000 రుపాయల ప్యాకేజ్ అందుకొంటున్నాడు. ఈ ప్యాకేజి ఇండియాలో మేనేజర్ స్థాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల ప్యాకేజ్‌కు సమానం కావడం గమనార్హం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -