Monday, May 6, 2024
- Advertisement -

43 వేలసార్లు.. ఆమెని రేప్ చేశారట.. ప్రస్తుతం ఆమె..?

- Advertisement -

ప్రతి రోజూ 30 మంది 43,200 సార్లు నాలుగు సంవత్సరాల పాటు తనని రేప్ చేశారని కార్లా జాసింటో మెక్సికో దేశానికి చెందిన ఓ సాధారణ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి అంతర్జాతీయ మీడియా సంస్థకు వెల్లడించింది. మానవ అక్రమ రవాణా ముఠా బారిన పడిన కార్లా తాను అనుభవించిన ఆ దారుణాన్ని తలుచుకుంటే ఇప్పటికి తనకు వణుకు వస్తుందని ఆమె తెలిపింది.

కార్లా.. 12 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు.. ఓ హ్యుమన్‌ ట్రాఫికర్‌ పట్ల ఆకర్శితురాలై అతను ఇచ్చే గిఫ్ట్‌లకు, డబ్బుకు ఆకర్శితురాలు అయ్యి.. అతన్ని గట్టిగా నమ్మింది. ఓ రోజు కార్లాను కలిసిన అతడు తనతో పాటు వచ్చేయమని అడిగాడు. అతను నమ్మిన ఆమె అతనితో బయటకు వెళ్లింది. మానవ అక్రమ రవాణా ముఠా చేతిలో చిక్కింది. ఆ తర్వాత ఆమెను ముఠాలోని సభ్యులు బలవంతంగా వేశ్యగా మార్చారు. ఉదయం మొదలు.. అర్ధరాత్రి వరకు విటులు వచ్చేవారని ఆమె తెలిపింది. ఆ బాధను తట్టుకోలేక తాను బాగా ఏడ్చేదానని.. అది చూసి విటులు గట్టిగా నవ్వుకునేవారని చెప్పింది. ఏం చేయలేక బాధ తట్టుకోలేక కళ్లు మూసుకునే దాన్నని.. దాంతో ఏం జరుగుతుందో తనకు తెలిసేది కాదని తెలిపింది.

ఒక రోజు తన మెడపై పెదవుల గుర్తులు ఉండటాన్ని చూసిన ఓ విటుడు.. విచక్షణా రహితంగా ఇనుప గొలుసులతో తనను కొట్టాడని కన్నీరు పెట్టుకుంది. జుట్టు పట్టుకుని పైకి లేపి ముఖం మీద ఉమ్మాడని చెప్పింది. ఆ తర్వాత ఇనుప చువ్వను కాల్చి వాతలు పెట్టాడని తెలిపింది. 2006లో పోలీసులు జరిపిన రైడింగ్‌ కార్లా పాలిట వరంగా మారింది. ఆ రైడింగ్‌లో ట్రాఫికర్స్‌ నుంచి తప్పించుకున్న కార్లా ప్రస్తుతం లాయర్‌ అయ్యారు. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా కోర్టుల్లో వాదిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -