హైదరాబాద్‌‌లో ఇక అంతర్జాతీయ స్థాయి పోలీస్ వ్యవస్థ

హైదరాబాద్‌‌లో ఇక అంతర్జాతీయ స్థాయి పోలీస్ వ్యవస్థ రూపుదిద్దుకోబోతుంది.

అధునిక హంగులతో, అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి రక్షణ వ్యవస్థను మరింత పకడ్బందీగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే సరికొత్త మోడళ్ల కార్లు జీపీఆర్ఎస్ వ్యవస్థతో అనుసంధానం చేసి గట్టి నిఘావ్యవస్థను అమలు చేయబోతుంది.