Sunday, May 19, 2024
- Advertisement -

అంతా లోకేష్ ”అభీష్టం” మేరకే!

- Advertisement -

మంత్రుల పేషీల్లో నియామకాలన్నీ లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని సమచారం. అన్నీ చంద్రబాబు తనయుడు లోకేశ్ ‘అభీష్ట’ం మేరకే జరుగుతున్నాయన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రులకు  వారిపై నిఘా ఉంచేలా, ప్రతి కదలికనూ తెలుసుకొనేలా వారి కార్యాలయాల్లో నియామకాలు జరుగుతున్నాయని సమాచారం. చిన్న స్థాయి వారిని కూడా మంత్రులు సిఫార్సు చేసిన వారిని నియమించడంలేదు.  మంత్రులు తమకు అనుకూలురైన, సమర్ధులని భావించిన అధికారులు, సిబ్బందిని పేషీల్లో నియమించుకోవడం సహజమే.ఇప్పుడు దానికి భిన్నంగా ఉంది. ఏ మంత్రి పేషీలో నియామకం అయినా కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు అన్నీ చినబాబు కనుసన్నల్లోనే జరుగుతున్నట్లు అధికారవర్గాలు సమచారం.
 జూనియర్లే కాదు.. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సహా సీనియర్ మంత్రుల పరిస్థితి కూడా ఇంతే. యనమల గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాలంలో ఆయన పేషీలో ఒఎస్‌డీగా శ్రీనివాసరావు పనిచేశారు. 2004లో టీడీపీ ఓడిపోయి, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అప్పటి మంత్రి రఘువీరారెడ్డి దగ్గర శ్రీనివాసరావు ఒఎస్‌డీగా చేరారు. అదీ.. యనమల సూచన మేరకే రఘువీరా నియమించుకున్నారు. మళ్లీ ఇప్పుడు యనమల ఆర్థిక మంత్రి కావడంతో, శ్రీనివాసరావును ఒఎస్‌డీగా నియమించుకున్నారు. దీనికి సీఎం అంగీకరించలేదు. కాంగ్రెస్ మంత్రుల వద్ద పనిచేసిన వారిని మంత్రులు కార్యాలయాల్లో నియమించుకోవద్దని స్పష్టంచేశారు. సీఎం కార్యాలయం ఆదేశాలకు యనమల  తలొగ్గి శ్రీనివాసరావును వెనక్కి పంపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -