- Advertisement -

సుజుకీ ఇంట్రూడర్‌ లుక్‌ అదిరింది …..

- Advertisement -

సుజుకీ కంపెనీనుంచి మ‌రో కొత్త అత్యాధునిక టీవీల‌ర్ మార్కెట్‌లోకి రాబోతోంది. మ‌రో వారం రోజుల్లో ఈ స‌రికొత్త ఇంట్ర‌డూర్ 150 సిసి బైక్‌ను ఆవిస్క‌రించ‌డానికి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ముందుగానె ఇవే ఇంట్రూడర్‌ అంటూ ఆన్‌లైన్‌లో కొన్ని ఫొటోలు దర్శనమిస్తున్నాయి. ఈ బండి బ్రోచర్‌లా కనిపిస్తున్న ఆ ఫొటోలు చూస్తుంటే… ఇంట్రూడర్‌ ఇలానే ఉంటుందేమో అనిపిస్తోంది.

ఇంట్రూడ‌ర్ బైక్ బ‌జాజ్ అవేంజ‌ర్‌ను 150 ని పోలి ఉంటుంద‌నె వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికె దీని బుకింగ్స్ ప్రారంభ‌మ‌య్యాయి. దీని ధర సుమారు ల‌క్ష‌రూపాయ‌లు ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. లీక్‌ అయిన బ్రోచర్‌ను చూస్తుంటే ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌లో విడుదలైన ఇంట్రూడర్‌కు దీనికి దగ్గర పోలికలు కనిపిస్తున్నాయి.

ఇంట్రూర్ బైక్‌లో 154.9సీసీ సింగిల్‌ సిలిండర్‌ యూనిట్‌ ఉంటుంది. గిక్సర్‌ సిరీస్‌ ద్విచక్ర వాహనాల మాదిరిగా ఇందులో ఏబీఎస్‌ సేఫ్టీ ఫీచర్‌ ఉంటుందని తెలుస్తోంది. వీటి లెక్క పక్కా తేలాలంటే నవంబర్‌ 7 వరకు ఆగాల్సిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -