- Advertisement -

భాజాపా క‌ల‌సి ఉండాలో లేదో తేల్చుకోవాల‌ని శివ‌సేన‌కు అల్టిమేట్టం జారీ చేసిన భాజాపా…

- Advertisement -

మ‌హారాష్ట్ర‌లో మిత్ర ప‌క్షాలు భాజాపా-శివ‌సేన మ‌ధ్య విబేధాలు ముదిరి పాకాన ప‌డ్డాయి. రెండు పార్టీలు తెగ‌దెంపులు చేసుకొనే స్ధాయికి ప‌రిస్థితులు వెల్లాయి . ఇద్ద‌రి మ‌ధ్య కలహాలు కాపురం క్లైమాక్స్‌కు చేరినట్టు కనిపిస్తోంది. పైకి రెండు పార్టీలు క‌ల‌సి ఉన్నా స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఒక‌రిమీద ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం ప‌రిపాటిగా మారింది.

మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న బీజేపీ-శివసేన ఆది నుంచి ఇద్ద‌రి మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తె భ‌గ్గుమంటూనె ఉంటుంది. గ‌తంలో కూడా అనేక సార్లు శివ‌సేన భాజాపా మీద విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించింది. ఇప్పుడు తాజాగా శివసేన నేత సంజయ్‌ రౌత్‌ బీజేపీతో తెగదెంపులకు సిద్ధమన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఏకంగా మిత్ర‌ప‌క్షం అయిన‌ప్ప‌టికి బీజేపీయే తమ ప్రధాన శత్రువు అని ప్రకటించారు.

శివ‌సేన త‌న సొంత ప‌త్రిక సామ్నాలో మ‌రోబాంబ్ పేల్చే వార్త‌ను ప్ర‌చురించింది. బీజేపీకి నచ్చితో శివసేనతో పొత్తు కొనసాగించాలని, లేదంటే దేవేంద్ర ఫడవిస్‌ ప్రభుత్వం పొత్తు నుంచి వైదొలగవచ్చునని తేల్చిచెప్పింది. ఆ పార్టీ చేసిన వ్యాఖ్య‌ల‌కు ధైటైన కౌంట‌ర్ ఇచ్చింది భాజాపా.

మిత్ర‌ప‌క్షం చేసిన వ్యాఖ్య‌ల‌ను మ‌హారాష్ట్ర సీఎం ఫ‌డ్న‌వీస్ తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. ఏకకాలంలో ఆ పార్టీ అధికారపక్షంగా, ప్రతిపక్షంగా రెండు పాత్రలు పోషించలేదని, కావాలంటే తమతో పొత్తు విషయంలో సేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే నిర్ణయం తీసుకోవచ్చునని అల్టిమేటం జారీచేశారు. మోదీ హవా మసకబారిందని, దేశాన్ని నడిపించే సామర్థ్యం రాహుల్‌ గాంధీకి ఉందని ఆయన టీవీ చర్చలో వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్య‌లు ఇప్పుడు దుమారాన్ని లేపుతున్నాయి.శివసేనతో పొత్తు కొనసాగించాలా? లేదా? అన్న విషయంలో బంతి బీజేపీ కోర్టులోనే ఉందని తెగేసి పేర్కొంది. ఇలా ఎన్నాల్లు బ‌ల‌వంతంపు కాపురం చేయ‌డంకంటె విడాకులు తీసుకుంటె మంచిద‌నె భావ‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో వ్య‌క్త‌మ‌వుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -