ఏపీలో టీడీపీ తో భాజాపా పైకి కలసి ఉన్నా సొంతంగా ఎదిగేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది. స్థానిక నేతలు టీడీపీతో పొత్తు వద్దన్నా అధిష్టానం నిర్ణయంతో బలవంతంగా కలసి ఉన్నారు. అవసరం వచ్చినప్పుడల్లా బాబుపై విమర్శలు గుప్పిస్తూనె ఉన్నారు. అయితె మొదటినుంచి చంద్రబాబుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న భాజాపా సీనియర్ మహిళా నేత పురందేశ్వరి ఇప్పుడు మరో సారి బాబుకు చుక్కలు చూపిస్తోంది.
పోలవరం ప్రాజెక్టు, ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలు, ఆమరావతి రాజధాని విషయంలో బాబుకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు కూడా రాసింది. అయితె ఇప్పుడు తాజాగా బాబు సొంత జిల్లాలో చెక్ పెట్టేందుకు పావులు కదుపుతోంది. దానిలో భాగంగానె చిత్తూరు మాజీ ఎమ్మెల్యే.. స్థానికంగా తనకంటూ ప్రజాబలం ఉన్న నాయకుడు అయిన సికె బాబును పురుందేశ్వరి వలవడం చర్చనీయాంశంగా మారింది.
సికె బాబు తనకు ఎంతో కాలంగా పరిచయస్తులు అని పురందేశ్వరి చెబుతున్నప్పటికీ.. భాజపాలోకి రావాల్సిందిగా ఆహ్వానించడానికే ఆమె కలిసి ఉంటారనే ప్రచారం షురూ అయింది. చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించే కాంగ్రెస్ నాయకుల్లో ఒకప్పుడు చెలరేగిన సికె బాబు ఒకరు. ఆయనను పార్టీలోకి ఆహ్వానించి బాబు దూకుడుకు అడ్డకట్ట వేసేందుకె అన్న వార్తలు వినిపిస్తున్నాయి.
గత కొంతకాలంగా ఆయనను భాజపాలోకి తీసుకురావడం గురించి మంతనాలు సాగినట్లుగా తెలుస్తోంది. పార్టీ బలోపేతంపై ఇప్పటి వరకు ఆదిశగా ప్రయత్నాలు చేలేదు. అయితె ఇప్పుడు సీకె బాబుతోనె మొదలు పెట్టాలని పావులు కదుపుతోంది. ఆయనను పార్టీలో చేర్చుకోవడం భాజపాకు లాభసాటి అవుతుందనే పలువురు నాయకులు భావిస్తున్నారు.
చంద్రబాబునాయుడు సొంతజిల్లాలో, చంద్రబాబు అంటే ఒంటికాలిపై లేచే చిరకాల శత్రువు సికె బాబును అక్కున చేర్చుకుంటూ తమ విస్తరణ ప్రయత్నాలను ప్రారంభించడంలో ఏదో అంతరార్థం ఉన్నదనే పలువురు భావిస్తున్నారు. బాబు దూకుడును కొంతైనా తగ్గించేందుకు భాజాపా ప్రయత్నాలు చేస్తోంది.
