Tuesday, April 30, 2024
- Advertisement -

అఖిల్ కి సీరియస్ వార్నింగ్.. రెండో సినిమా కూడా ప్లాప్ చేస్తావా.. నాగ్ ఫైర్

- Advertisement -

అఖిల్ తన చిన్నప్పుడే సినిమాల్లో నటించి.. అందరి దృష్టిలో వారేవా అనిపించుకున్నాడు. ఇక పెద్దాయ్యాక సినిమాలో హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే.. అతనిపై భారీ అంచనాలు ఉండేలా చూసుకున్నాడు. అదే అంచనాలతో అఖిల్ సినిమాలో నటించి ఆ ఆంచనాలను తారుమారు చేశారు. అఖిల్ మొదటి సినిమా దారుణమైన పరాజయపాలైంది. ఇందుకు కారణం అఖిల్‌ కి అనుభవం లేకుండానే అన్ని విషయాల్లో కలగ చేసుకుంటున్నాడనే విమర్శలు అప్పట్లోనే బాగా వచ్చాయి.

వినాయక్ లాంటి స్టార్ డైరెక్టార్ని దర్శకుడిగా పెట్టుకున్నా కానీ అతనిపై అన్ని బాధ్యతలు వదిలేయకుండా తనే నిర్ణయాలు తీసుకున్నాడు. అఖిల్ మూవీకి స్టోరీ సరిగ్గా లేదని అందరూ భావిస్తే అదే కావాలని పట్టుబట్టి చేశాడు అన్నారు అప్పట్లో. అది కాస్తా పెద్ద డిజాస్టర్ కావడంతో రెండో మూవీ సెట్ చేయడానికి నాగార్జునకు చాలా సమయం పట్టింది. అక్కినేని ఫ్యామిలీకి మనం లాంటి మంచి సినిమాని ఇచ్చిన విక్రమ్ కుమార్ తో హలో సినిమాని పట్టాలేకించాడు నాగార్జున. ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అఖిల్ జోక్యం చేసుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. సాంగ్స్ ఓకే చేయడం దగ్గరనుంచి.. ఫైట్లు ఎలా ఉండాలనే దాని వరకు అన్నిట్లో అఖిల్ వెలుపెడుతున్నాడట. విక్రమ్‌ కుమార్‌కి స్టార్ డైరెక్టర్. అతనికి చాలా అనుభవం ఉంది. ఏ సినిమా అయిన ఒక ప్రత్యేక శైలిలో సూపర్ హిట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తాడు. అతని సినిమాలు అన్ని అలా వచ్చి సూపర్ హిట్ అయినవే. అయితే ఇప్పుడు విక్రమ్ డైరెక్షన్ విషయంలో అఖిల్ వేలుపెట్టడంతో.. కోపం తెచ్చుకున్న విక్రమ్ వెంటనే నాగార్జునకు కంప్లేంట్ చేశాడట.

డిసెంబర్‌ 22న రిలీజ్ కు ప్లాన్ చేయడంతో షూటింగ్ పనులు వెగంగా జరుగుతున్నాయి. అయితే అఖిల్ తన పని తాను చేయకుండా మిగిత వాటిలో కూడా వేలు పెట్టడం వల్ల.. సినిమా అనుకున్న టైంకి రావడం కష్టం అంటున్నారు. దాంతో విషయం తెలుసుకున్న నాగార్జున వెంటనే అఖిల్ ని పిలిచి.. వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విక్రమ్ విషయంలో జోక్యం చేసుకోకు.. రెండో సినిమా కూడా ప్లాప్ చేస్తావా.. నీవరకు షూట్ చేసుకొని ఇంటికి వచ్చేయి అని అఖిల్ కి నాగర్జున చెప్పినట్లు తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -