Saturday, May 18, 2024
- Advertisement -

చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి నిధులు రాకుండా కేంద్రం చెక్‌…

- Advertisement -

ఏపీసీఎం చంద్ర‌బాబు చుట్టూ కేంద్రం ఉచ్చు బిగిసుకుంటోంది. వివిధ ప‌థ‌కాల‌ను కేంద్రంనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల‌ను విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో బాబు ఒడ్డున ప‌డ్డ చేప‌లా కొట్టుమిట్టాడుతున్నారు. భాజాపాతో క‌ల‌సి ఉంటె రాష్ట్రం అభివృద్ధి చెందుతాద‌ని భావించిన బాబుకు రాను రాను మోదీ స‌ర్కార్ చుక్క‌లు చూపిస్తోంది. దానికి కార‌నం చంద్ర‌బాబు చేస్తున్న సొంత త‌ప్పిదాల‌నె చెప్ప‌వ‌చ్చు.

రాష్ట్రంలో అమ‌ల‌వుతున్న ప‌థ‌కాల‌కు కేంద్రం విడుద‌ల చేసిన నిధుల వివ‌రాలు కేంద్రానికి చెప్ప‌క‌పోవ‌డంతో గుర్రుగా ఉంది. గడచిన మూడున్నరేళ్ళల్లో సుమారుగా రూ. 4 వేల కోట్లకు చంద్రబాబు ప్రభుత్వం కేంద్రానికి లెక్కలు చూప‌కుండా బాబు ప్ర‌భుత్వం మీన‌వేశాలు లెక్కిస్తోంది.

నూతన రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ. 2500 కోట్లకు ఇంత వరకూ లెక్కలు చెప్పలేదు. సర్వశిక్ష అభియాన్ క్రింద రాష్ట్రానికి వచ్చిన నిధుల్లో రూ. 511 కోట్లకు లెక్కలు పంపలేదు. అందుకనే తర్వాత విడుదలవ్వాల్సిన రూ. 381 కోట్లు విడుద‌ల చేయ‌కుండా కేంద్ర ఆడ్డుకుంది.

మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు క్రింద రూ. 212 కోట్లు, ప్రణాళికేతర రెవెన్యూ గ్యాప్ రూపంలో రూ. 139 కోట్లు, మధ్యాహ్న భోజన పథకం క్రింద రూ. 92 కోట్లు, పోస్ట్ మెట్రిక్ ఎస్టీ ఉపకార వేతనాల పథకం క్రింద రూ. 80 కోట్లు, ఐసిడిఎస్ లో విడుదలైన రూ. 43 కోట్లకు లెక్కలు .

కేంద్రం ఇలా రాష్ట్రంపై వివ‌క్ష చూపుతుండ‌టానికి కార‌నం చంద్ర‌బాబు వ్య‌వ‌హార‌శైలే. కేంద్రంనుంచి రాష్ట్రానికి విడుద‌ల‌యిన నిధుల వివ‌రాల‌ను చూపుతేనె క‌దా త‌ర్వాత నిధుల‌ను విడుద‌ల చేసేది. అసలు కేంద్రం ఇచ్చిన నిధులకు చంద్రబాబు సర్కార్ ఎందుకు లెక్కలు చెప్పలేకపోతోంది? కేంద్రం డబ్బిస్తోంది, రాష్ట్రం ఖర్చు పెడుతోంది. అయితే, ఆ ఖర్చే ఏ అవసరాలకు చేస్తోందన్నదే సస్పెన్స్. ణమాఫీ, చంద్రన్న కానుకలు, ప్రత్యేక విమాన ఖర్చులు ఇలా అనేక రూపాల్లో పక్కదారి పట్టాయన్నది కేంద్రం అనుమానిస్తున్నట్లు సమాచారం.

కేంద్రం నుండి నిధులు రాకున్నా నిలదీయటానికి చంద్రబాబుకు ధైర్యం చాల‌డంలేదు. విషయంలోనే కేంద్రం, రాష్ట్రప్రభుం చుట్టూ ఉచ్చు బిగించేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న 44 పథకాలల్లో ఏపి వాటా తగ్గిపోవటం. మిగిలిన రాష్ట్రాలకు నిధులను కేటాయిస్తున్న కేంద్రం ఒక్క ఏపికి మాత్రం దాదాపు ఆపేస్తోంది. ఎందుకు నిధులు ఆపుతుందో చంద్ర‌బాబుకె తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -