వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తల పెట్టిన పాదయాత్రకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఇన్నాల్లు పాదయాత్రకు అనుమతిపై ఉన్న సందిగ్ధానికి తెరపడింది. జగన్ పాదయాత్రకు ఏపీ పోలీసులు అనుమతినిచ్చారు. దీనిపై డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ, ఎవరినీ ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం తమకు లేదని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే అనుమతి తప్పనిసరి అని తెలిపామని అన్నారు.
వైఎస్సార్సీపీ నేతలు జగన్ పాదయాత్రకు దరఖాస్తు చేశారని ఆయన వెల్లడించారు. పాదయాత్రలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇకపై ఎవరు పాదయాత్ర చేయాలనుకున్నా పోలీసుల అనుమతి తప్పని సరి అని ఆయన మరోసారి స్పష్టం చేశారు. పాదయాత్రకు అనుమతి కోరేవారు రూట్ మ్యాప్ ను అందజేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో ఉన్నారు.